ఫిలిం సిటీలో బాలయ్య యాక్షన్ ఎపిసోడ్.. భారీ స్థాయిలో సిద్ధం అయిన సెట్!

నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) కెరీర్ లో 109వ సినిమాను ఈ మధ్యనే అఫిషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే.యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను బాలయ్య పుట్టినరోజు నాడు అఫిషియల్ గా లాంచ్ చేసారు.

 Nandamuri Balakrishna Director Bobby Nbk109 Shoot Update, Director Bobby, Tolly-TeluguStop.com

ఇక ఈ సినిమాను ప్రకటించినప్పటి నుండి ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ లాంచ్ తోనే భారీ అంచనాలు క్రియేట్ అవ్వగా ఇప్పుడు షూట్ గురించి లేటెస్ట్ గా అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ( Ramoji Film City )లో స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.బాలయ్య అంటేనే యాక్షన్ కాబట్టి ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్ తోనే స్టార్ట్ కానుంది అని టాక్./br>

అందుకు ఇప్పటికే ఫిలిం సిటీలో భారీ సెట్ ను రెడీ చేస్తున్నారని తాజా సమాచారం ప్రకారం మరో రెండు వారాల్లో ఈ భారీ యాక్షన్ సెట్ మొత్తం పూర్తి అవుతుందని ఆ తర్వాత ఈ సెట్ లో యాక్షన్ ఎపిసోడ్ ను స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడని తండ్రి కొడుకులుగా బాలయ్య నటిస్తాడని.తండ్రిగా బాలయ్య గెటప్ అదిరిపోనుందని ఇప్పటికే పలు వార్తలు వైరల్ అయ్యాయి.ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఫార్చ్యూన్ 4 ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా నిర్మాతలుగా నాగ వంశీ, త్రివిక్రమ్ భార్య సౌజన్య వ్యవహరించ బోతున్నారు.

థమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.ఇక ప్రజెంట్ బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) అక్టోబర్ 19న రిలీజ్ కానుంది.

ఈ లోపులోనే ఈ సినిమా షూట్ స్టార్ట్ కానుందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube