గౌతమ్ సినీ ఎంట్రీ ఇచ్చేది అప్పుడేనా... అసలు విషయం చెప్పిన నమ్రత!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మహేష్ బాబు ( Mahesh Babu ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇక ఈయన కుమార్తె సితార ( Sitara ) ఇప్పటికే ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

 Gautham's Movie Entry Was Then Namrata, Mahesh Babu ,sitara ,namrata Tollywood,-TeluguStop.com

తాజాగా ఈమె పిఎంజె జువెలరీ సమస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసింది.తాజాగా ఈ జువెలరీ షాపింగ్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా సితార సందడి చేశారు.

ఈమెతో పాటు తన తల్లి నమ్రత ( Namrata ) కూడా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఇందులో భాగంగా గౌతమ్ ( Gautham )సినీ ఎంట్రీ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

Telugu Nenokkadine, Gautham, Mahesh Babu, Namrata, Sitara, Sukumar-Movie

గౌతమ్ మహేష్ బాబు వారసుడిగా ఇప్పటికే బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.సుకుమార్ ( Sukumar ) డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా నటించిన 1 నేనొక్కడినే సినిమా ద్వారా బాలా నటుడిగా అడుగుపెట్టారు.ఈ సినిమా అనంతరం ఈయన సినిమాలకు దూరమయ్యారు.

అయితే మీడియా ప్రతినిధి నమ్రతను ప్రశ్నిస్తూ గౌతమ్ సినీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని అడగడంతో నమ్రత ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.ప్రస్తుతం గౌతమ్ కు ఇంకా 16 సంవత్సరాలు మాత్రమేనని ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం స్టడీస్ పైనే ఉందని తెలిపారు.

Telugu Nenokkadine, Gautham, Mahesh Babu, Namrata, Sitara, Sukumar-Movie

గౌతమ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాతే సినిమాలలోకి వస్తారని అందుకు ఇంకా ఎనిమిది సంవత్సరాల వరకు సమయం పట్టవచ్చు అంటూ నమ్రత సమాధానం చెప్పారు.ఇలా మహేష్ బాబు వారసుడు హీరోగా ఇండస్ట్రీలోకి రావాలి అంటే మరో 8 సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సిందేననీ తెలుస్తుంది.గౌతమ్ అటు స్టడీస్ తోపాటు స్విమ్మింగ్ లోనూ నైపుణ్యం సాధించారు.ఇప్పటికే చాలా టైటిల్స్ గెలుచుకున్నారు.మరోవైపు థియేటర్ ఆర్ట్స్ పైనా శిక్షణ తీసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube