విజయ్ దేవరకొండ( VijayDevarakonda ) లైగర్( Liger ) ఫ్లాప్ తర్వాత ఇటీవల ఖుషి( Kushi ) సినిమాతో వచ్చి పర్వాలేదనిపించారు.ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఖుషి తర్వాత విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 12వ సినిమా, గీతగోవిందం లాంటి హిట్ సినిమా ఇచ్చిన పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 13వ సినిమాలున్నాయి.
విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా పీరియాడిక్ స్పై థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్ కూడా సినిమాపై ఆసక్తి పెంచుతుంది.ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నిర్మాత నాగ వంశీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు గౌతమ్ విజయ్ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమాకి 100 కోట్లు బడ్జెట్ వరకు అవుతుందని తెలిపారు.ఇంకా ఈ సినిమా పూర్తి అయ్యేలోపు బడ్జెట్ ఎక్కువే అవుతుందని ఈయన వెల్లడించారు.

ఇక ఈ సినిమాకు ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తున్నాను అంటే అది కేవలం డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి( Gautham Thinnanuri ) , మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ పై ఉన్నటువంటి నమ్మకంతోనే తాను భారీ స్థాయిలో బడ్జెట్ పెడుతున్నానని వెల్లడించారు.ఇక ఈ సినిమా నుంచి శ్రీ లీల తప్పుకోవడంతో రష్మిక ఈ సినిమాలో భాగమైంది అంటూ వార్తలు వచ్చాయి.ఈ వార్తలపై కూడా ఈయన స్పందించారు. శ్రీ లీల( Sreeleela ) మా బ్యానర్ లో చాలా సినిమాలు చేస్తుంది మేము తనని మా సినిమా నుంచి ఎందుకు తప్పిస్తాము.
రష్మిక ( Rashmika Mandanna )నటిస్తుంది అంటూ వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని ఈయన ఖండించారు.ఏది ఏమైనా ఈ సినిమా బడ్జెట్ మాత్రం విజయ్ దేవరకొండను చూసి పెట్టలేదు అంటూ పరోక్షంగా ఈయన కామెంట్ చేయడంతో విజయ్ ఫ్యాన్స్ నిర్మాత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.







