నాగార్జున సాగర్ వివాదంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.నాగార్జునసాగర్ అక్కడే ఉంటుందన్న ఆయన నీళ్లు అక్కడే ఉంటాయని పేర్కొన్నారు.
కొందరు కావాలనే నాగార్జునసాగర్ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.ఇన్నాళ్లు లేని సాగర్ సమస్య ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు.
ఈ క్రమంలో నాగార్జున సాగర్ వివాదం సీఈవో చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.పోలింగ్ కు ముందు కావాలనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.
అయితే తెలంగాణ ప్రజలు సమస్యను అర్థం చేసుకుంటారని వెల్లడించారు.