కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో వస్తున్న సినిమా ది ఘోస్ట్.స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా నుంచి ఆమధ్య వచ్చిన టీజర్ సూపర్ బజ్ ఏర్పడేలా చేసింది.
లేటెస్ట్ గా సినిమా నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు.దసరా కానుకగా అక్టోబర్ లో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమాని కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
ది ఘోస్ట్ రషెష్ చూసిన హిందీ డిస్ట్రిబ్యూటర్స్ సినిమాని హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తామని ఉత్సాహంగా ఉన్నారట.
ప్రస్తుతం తెలుగు సినిమాలకు హిందీలో బీభత్సమైన డిమాండ్ ఏర్పడింది.అందుకే ది ఘోస్ట్ సినిమాకు బంపర్ ఆఫర్ తగిలినట్టు తెలుస్తుంది.నాగార్జున చేస్తున్న ఈ యాక్షన్ మూవీ బాలీవుడ్ ఆడియెన్స్ ని కూడా మెప్పిస్తుందని అంటున్నారు.మరి ఈ స్టైలిష్ యాక్షన్ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
ఈ సినిమాలో నాగ్ సరసన హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది.సినిమా ప్రేక్షకులకు ఓ మంచి యాక్షన్ మూవీ అనుభూతిని అందిస్తుందని అంటున్నారు.







