టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం లో రూపొందిన ది ఘోస్ట్ సినిమా అక్టోబర్ 5వ తారీఖున దసరా సందర్భం గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయాన్ని నడుమ విడుదల కాబోతున్నాయి.సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
ఈనెల 25వ తారీఖున కర్నూలు లో భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు.కర్నూల్ లో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.
కనుక పెద్దగా గెస్ట్ లు ఎవ్వరు వచ్చే అవకాశం లేదని నాగార్జున మాత్రమే వస్తాడని, ఇప్పటి వరకు అనుకున్నారు.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున మాత్రమే కాకుండా ఆయన ఇద్దరు కొడుకులు అయిన అక్కినేని బ్రదర్స్ నాగ చైతన్య మరియు అఖిల్ ముఖ్య అతిథులుగా సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కు సంబంధించిన ప్రోమో మరియు పోస్టర్ లు సినిమా పై అంచనాలు భారీ గా పెంచాయి.ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మరింత స్పీడ్ పెంచేందుకు చిత్ర యూనిట్ సభ్యులు తీవ్రం గా కసరత్తు చేస్తున్నారు.నాగార్జున ఈ సినిమా తో దసరా కు రాబోతున్న నేపథ్యం లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ది గాడ్ ఫాదర్ సినిమా కు సంబంధించిన రిలీజ్ డేట్ కూడా అదే అనే విషయం తెలిసింది దసరా కి నాగార్జున మర్రి చిరంజీవి పోటీ పడబోతున్న నేపథ్యం లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్రమోషన్ కార్యక్రమాలు కాస్త భారీగానే ఉండాలి, అందుకే అక్కినేని బ్రదర్స్ ఇద్దరి ని ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.







