ఆన్లైన్ పేరేంటింగ్ క్లాసెస్ తీసుకుంటున్న కాజల్.. ది ఘోస్ట్ లో హీరోయిన్ ఛేంజ్!

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్నాడు.

నాగార్జున నటించిన బంగార్రాజు సినిమా ఇటీవలే సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన విషయం అందరికి తెలిసిందే.

ఈ సినిమా విడుదల అయ్యి మంచి విజయాన్ని సాధించింది.ఇక సినిమా మంచి విజయం సాధించిన సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ లు కూడా నిర్వహిస్తున్నారు.

సినిమా విజయం సాధించిన ఉత్సాహంతో అదే హుషారుతో నాగార్జున తన నెక్స్ట్ సినిమా అయిన ది ఘోస్ట్ సినిమాను పట్టా లెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే.

అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను కూడా ఇప్పటికే విడుదల చేశారు చిత్ర బృందం.ఈ సినిమాకు సత్తారు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

ది ఘోస్ట్ సినిమా హీరో రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమా తరహాలో ఆకట్టుకోబోతోంది అని చిత్ర యూనిట్ తెలిపింది .ఇక ఈ సినిమాలో నాగార్జున రా ఏజెంట్ గా కనిపించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగార్జున కు జోడిగా నటించే విషయంలో తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అయితే ముందుగా ఈ సినిమాలో నాగార్జున సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను అనుకున్న విషయం అందరికి తెలిసిందే.

అయితే కాజల్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పకుందట.ఇక ఈ సినిమాలో కాజల్ స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన విషయం అందరికి తెలిసిందే.

కానీ ఇప్పటి వరకు ఈ సినిమాలో హీరోయిన్ సీన్స్ ను షూట్ చేయలేదట.ఇందులో హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ ఎంపిక అవ్వడంతో షూటింగ్ శరవేగంగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

ఇకపోతే సోనాల్ చౌహాన్ విషయానికి వస్తే.ఇప్పటికే ఈమె తెలుగులో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తెలుగులో డిక్టేటర్, లెజెండ్, రూలర్, పండగ చేస్కో లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.

Advertisement

ఇకపోతే ప్రస్తుతం సోనాల్ చౌహాన్ ఎఫ్ 3 సినిమాలో నటిస్తోంది.

తాజా వార్తలు