నాగార్జున సాగర్ ఉపఎన్నిక పోరు రణరంగంగా మారింది.పార్టీల నేతల కవ్వింపు ప్రసంగాలతో నియోజకవర్గం నివురు గప్పిన నిప్పులా మారింది.
అసలు ఈ ఎన్నిక నేతల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే పోరుగా భావిస్తున్నారట.ఈ క్రమంలో మంగళవారం ఏకంగా అనుముల మండలంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది.
ఇకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ప్రచారాన్ని అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైనట్టు సమాచారం.కాగా ఈ ఘర్షణలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలవగా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి తనయుడు జయవీర్ రెడ్డి ధర్నాకు దిగారు.

ఇక హాలియాలో బుధవారం సీఎం కేసీఆర్ సభ ఉన్న నేపథ్యంలో నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.మొత్తానికి సాగర్ ఊప ఎన్నికలో ఎప్పుడులేని చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయని అర్ధం అవుతుంది.