బిగ్‌బాస్‌ : విమర్శలకు సమాధానం ఇచ్చిన నాగార్జున

తెలుగు బిగ్‌బాస్‌ మొదటి రెండు సీజన్‌లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.టీఆర్పీ రేటింగ్‌ విషయంలో రికార్డు నమోదు చేశాయని చెప్పాలి.

కాని మూడవ సీజన్‌ విషయంలో మాత్రం తీవ్రమైన నిరుత్సాహం వ్యక్తం అవుతోంది.తెలుగు బిగ్‌బాస్‌ మూడవ సీజన్‌కు నాగార్జున హోస్టింగ్‌ చేస్తున్నాడు.

సాదారణంగా బిగ్‌బాస్‌ అంటే స్క్రిప్ట్‌ లేకుండా అంతా సాగిపోతూ ఉంటుంది.కాని ఈ సీజన్‌ మాత్రం నిర్వాహకులు కొన్ని ట్రిక్స్‌ ప్లే చేస్తున్నట్లుగా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇంట్లో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్స్‌ అంటూ కొందరికి పేరు వచ్చింది.వారికి ప్రేక్షకుల్లో అభిమానం తక్కువ ఉన్న నేపథ్యంలో బిగ్‌బాస్‌ వారిని కాపాడుతూ వస్తున్నాడు.

Advertisement

అంటే వారికి ఓట్లు రాకున్నా కూడా వారు ఎలిమినేషన్‌లో ఉంటే సేవ్‌ చేస్తూ వస్తున్నాడు.బిగ్‌బాస్‌లో ఎలిమినేషన్‌ అనేది ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా జరుగుతుంది.

కాని ఈసారిమాత్రం బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఏం అనుకుంటే అదే జరుగుతుంది, వారు ఏం చెబితే అలాగే చేస్తున్నారు.నాగార్జున ముందు నుండి శ్రీముఖికి మద్దతుగా ఉంటున్నాడు.

  రాహుల్‌ మరియు పునర్నవిలను కొనసాగించాలని నాగార్జున చెప్పాడట.ఈముగ్గురు ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయితే సేవ్‌ చేయాల్సిందిగా స్వయంగా నాగార్జున నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశాడంటూ ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో నిన్నటి ఎపిసోడ్‌లో నాగార్జున స్పందిస్తూ ఎలిమినేషన్‌ విషయంలో, సేవ్‌ విషయంలో నాకు ఎలాంటి సమాచారం లేదని, అసలు ఎలిమినేషన్‌కు వస్తున్న ఓట్ల విషయంలో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చాడు.

తాను వచ్చి హోస్టింగ్‌ చేస్తున్నాను తప్ప అంతకు మించి ఇన్వాల్వ్‌ అవ్వడంలేదని నాగ్‌ క్లారిటీ ఇచ్చాడు.

Nutmeg Helps To Lose Weight After Delivery Nutmeg, Lose Weight, Delivery, After Delivery, Latest
Advertisement

తాజా వార్తలు