చిరంజీవితో సినిమా చేయాలని ప్రతి ఒక్కరి కోరిక.తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత మూడు దశాబ్దాలుగా స్టార్ హీరోగా వెలుగు వెలుగుతూనే ఉన్న చిరంజీవి పది సంవత్సరాల రాజకీయం తర్వాత ఖైదీ నెం.150 చిత్రంతో చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాడు.అప్పటి నుండి కూడా పలువురు దర్శకులు మరియు రచయితలు చిరంజీవికి కథ చెప్పేందుకు క్యూ కట్టారు.
తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి చిత్రంను చేసిన చిరంజీవి గాంధీ జయంతి సందర్బంగా ప్రేక్షకులముందుకు తీసుకు రాబోతున్నాడు.
సైరా విడుదలైన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో ఒక చిత్రంను చిరంజీవి చేయబోతున్నాడు.
ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక క్లారిటీ ఇచ్చారు.చిరంజీవి 152వ చిత్రం కొరటాల దర్శకత్వంలో ఉండగా, 153వ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి ‘అల వైకుంఠపురంలో’ చిత్రంను చేస్తున్న దర్శకుడు త్రివిక్రమ్ ఇటీవల చిరంజీవికి ఒక స్టోరీ చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.

చిరంజీవికి కూడా త్రివిక్రమ్ అంటే ఉన్న అభిమానం కారణంగా సినిమాను చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.అయితే వచ్చే ఏడాది చివరి వరకు సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల కాంబో మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఆ వెంటనే చిరుతో మొదలు పెట్టే అవకాశం ఉందేమో చూడాలి.







