తెలుగు సినిమా ఇండస్ట్రీలో కింగ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు నాగార్జున( Nagarjuna ).గత కొన్ని సంవత్సరాలుగా ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావాన్ని అయితే చూపించలేక పోతున్నాయి.
దానికి కారణం ఏంటి అనే విషయాలను తను ప్రస్తుతం పరిశీలించే క్రమంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే సంక్రాంతి కానుక గా భారీ అంచనాలతో వచ్చిన ‘నా సామిరంగా'( Naa Saami Ranga ) సినిమా భారీ డిజాస్టర్ అయింది.
ఇక దానివల్ల ఆయన ఇప్పుడు చేసే సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది.ప్రస్తుతం ఆయన ఎవరితో సినిమా చేయాలి అనే ఒక డైలామాలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పుడు ఆయన కథలను కూడా ఎక్కువగా వింటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ప్రస్తుతం చాలామంది దర్శకులు ఆయనకి కథలు చెబుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక రీసెంట్ గా రజాకార్ సినిమాతో ఒక సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్న యాట సత్యనారాయణ( Yata Satyanarayana ) కూడా ఇంతకు ముందే నాగార్జునకి ఒక కథను వినిపించారట.కథ బాగా నచ్చినప్పటికీ ‘రజాకర్ ‘ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా గురించి ఆలోచిద్దాం అనే ఒక నిర్ణయంలో నాగార్జున ఉన్నారట…
కానీ రీసెంట్ గా రజాకర్ సినిమా( Razakar ) రిలీజ్ అయి సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు నాగార్జున ఆయనకి అవకాశాన్ని ఇస్తాడా అనే ఒక వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది.నాగార్జున ఇమేజ్ కు తగ్గ కథను తను వినిపించినట్టుగా తెలుస్తుంది.మరి ఆ దర్శకుడి కి నాగార్జున అవకాశాన్నిచ్చే ఛాన్సులు ఉన్నాయా లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…
.