నాగార్జునకు ఆ ఆలోచన లేదట.. ఫ్యాన్స్ కు పెద్ద బ్యాడ్‌ న్యూస్‌

టాలీవుడ్ కింగ్ నాగార్జున( Nagarjuna ) కి ఈ మధ్య కాలంలో టైం సరిగా ఉన్నట్లుగా లేదు అనిపిస్తుంది.అందుకే ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ వస్తున్నాయి.

 Nagarjuna Don't Want To Do Like That Roles M, Nagarjuna , Tollywood,  The Ghost-TeluguStop.com

చాలా సంవత్సరాలుగా నాగార్జున కమర్షియల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సొంతం చేసుకోవడంలో విఫలమవుతున్నాడు.ఆ మధ్య బంగార్రాజు అనే సినిమాతో కాస్త పర్వాలేదు అనిపించాడు.

కానీ అంతకు ముందు ఆ తర్వాత అన్ని నిరాశ పరిచిన సినిమాలే.అయినా కూడా నాగార్జున పట్టుదలతో సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

ఇద్దరు కొడుకులు హీరోలుగా నటిస్తూ ఉన్న ఈ సమయంలో కూడా నాగార్జున హీరో పాత్రలు చేస్తున్నాడు.టాలీవుడ్ లో చాలా మంది సీనియర్ హీరోలు ఆరు పదుల వయసులో కూడా హీరో పాత్రలను చేస్తున్న విషయం తెలిసిందే.

Telugu Akhil Akkineni, Akkineni, Bollywood, Naga Chaitanya, Nagarjuna, Prasannak

వారు మరి కొన్నాళ్ల తర్వాత ఇతర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసే అవకాశాలు ఉన్నాయి.కానీ నాగార్జున మాత్రం ఆ విషయం ఆసక్తి చూపించడం లేదట.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జునకు హీరోగా మాత్రమే నటించాలని ఉందట.భవిష్యత్తులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి తన ఇమేజ్ ని తగ్గించుకోను అంటూ నాగార్జున ఇటీవల స్నేహితుల వద్ద పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Telugu Akhil Akkineni, Akkineni, Bollywood, Naga Chaitanya, Nagarjuna, Prasannak

ఒకప్పుడు హీరోగా నటించి అమితాబచ్చన్( Amitabh Bachchan ) ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న విషయం తెలిసింది.అలా ఎంతో మంది స్టార్స్ హీరోగా చేసి క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు.కానీ నాగార్జున మాత్రం ఆ విషయంలో ఆసక్తి కనబడటం లేదు.ఈ మధ్య కాలంలో ఒక యంగ్ రైటర్ నాగార్జున వద్దకు ఒక కథను తీసుకెళ్లాడట.ఆ కథలో హీరో మరొకరు ఉంటారు.ముఖ్యపాత్రలో నాగార్జున కనిపించాల్సి ఉంటుందట.

కానీ ఆ పాత్రకు నాగార్జున ఓకే చెప్పలేదు.హీరోగా అయితేనే నటిస్తానంటూ తేల్చి చెప్పాడట.

మల్టీ స్టారర్‌ సినిమాల విషయంలో కూడా నాగార్జున ఆసక్తి చూపించడం లేదట.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున మరియు ఇతర అక్కినేని హీరోలు చిన్న బ్రేక్ తీసుకుని కొత్త సినిమాలతో సరికొత్తగా అభిమానులను అలరించేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రస్తుత నాగార్జున ప్రసన్న కుమార్ బెజవాడ( Prasanna Kumar Bezawada ) దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు.ఆ సినిమా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube