నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీకానుంది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రారంభం అయిన తరువాత నిర్వహిస్తున్న తొలి కేబినెట్ భేటీ ఇదే కావడం విశేషం.
ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.అదేవిధంగా గవర్నర్ తమిళిసై వెనక్కి పంపిన బిల్లులపై మంత్రివర్గం చర్చించనుంది.
పోడు భూముల పంపిణీ, దశాబ్ది వేడుకల నిర్వహణతో పాటు అమరుల స్మృతి వనం ప్రారంభ తేదీని ఖరారు చేయనుంది.మరోవైపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో సమావేశాల నిర్వహణపై కూడా చర్చించే అవకాశం ఉంది.







