బిగ్‌బాస్‌4 : గంగవ్వ కన్నీళ్లు, జోకర్‌ ఎంట్రీతో కళకళ

ఈ సీజన్‌ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న గంగవ్వ ఆ వాతావరణం లో ఉండలేక ఇబ్బంది పడుతోంది.

ఇంటి సభ్యులు ఆమెను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఉన్నారు.

అయినా కూడా ఆమెకు ఏమాత్రం అక్కడి వాతావరణంలో ఉండటానికి వశపడటం లేదు.ఆమె మొదటి వారం రోజులు బాగానే ఉన్నట్లుగా అనిపించినా రెండవ వారం మొదలు ఆమె ఆరోగ్యం విషయంలో మార్పులు రావడంతో పాటు ఆమె అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నట్లుగా అనిపిస్తుంది.

ఇంటి సభ్యులు ఆమె పట్ల ఎంతో వాత్సల్యంగా ఉంటున్న కారణంగా ఇన్నాళ్లు అయినా ఉండగలిగింది.ఆరోగ్యం బాగా లేక పడుకున్న సమయంలో ఆమెను కన్ఫెషన్‌ రూంకు బిగ్‌బాస్‌ పిలిసి ట్రీట్‌మెంట్‌ ఇప్పిస్తాం భయపడకండి అన్నాడు.

మీరు చాలా ధైర్యం కలిగిన వారిగా భావిస్తున్నాం అన్నారు.ఆ సమయంలో గంగవ్వ కన్నీరు పెట్టుకోవడం అందరిని కదిలించింది.

Advertisement

ఉండటానికి సరిగా ఇళ్లు లేక పోవడంతో డబ్బులు వస్తాయని వచ్చాను.కాని నా వల్ల అవ్వడం లేదు.

మీరు అమ్మలా చూసుకుంటున్నారు.అందరు కూడా ఎంతో మంచిగా ఉంటున్నారు.

అయినా ఈ వాతావరణంలో ఉండటం నా వల్ల అవ్వడం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.గంగవ్వ ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని రోజులు ఉండటం చాలా గొప్ప విషయమే.

సంపూర్నేష్‌ బాబు కనీసం వారం రోజులు కూడా ఉండలేక పోయాడు.గంగవ్వ రెండు వారాలు అంతకు ముందు క్వారెంటైన్‌ లో రెండు వారాలు గడిపింది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

అంటే ఇప్పటికే ఆమె ఊరు వదిలి వచ్చి నాలుగు వారాలు అయ్యింది.కనుక ఆమె ప్రాణం లాగుతోంది.

Advertisement

నిన్నటి ఎపిసోడ్‌ లో ఆమెను చూస్తే ఎవరికైనా బాధగా అనిపిస్తుంది.

ఇక నిన్నటి ఎపిసోడ్‌ లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ గా ముక్కు అవినాష్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అతడి రాకతో ఇంట్లో సందడి వాతావరణం కనిపిస్తోంది.అతడు వచ్చిన వెంటనే ఇంటి సభ్యులు అతడికి సాదర స్వాగతం పలికారు.

అతడితో కామెడీ చేయించారు, నవ్వుకున్నారు.అమ్మాయి డ్రస్‌ వేసి అతడితో క్యాట్‌ వాక్‌ చేయించారు.

ఇక నిన్నటి ఎపిసోడ్‌ లో మరో కీలక విషయం సుజాత, అభిజిత్‌ల మద్య జరిగింది.సుజాతను తాను సిస్టర్‌గా అనుకుంటాను అంటూ అభిజిత్‌ అనడం జరిగింది.

అందుకు సుజాత బాగా ఫీల్‌ అయ్యింది.సిస్టర్‌ అన్నందుకు సుజాత ఎందుకు ఫీల్‌ అయ్యిందో అందరు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

తాజా వార్తలు