టాలీవుడ్ లో సీనియర్ మోస్ట్ హీరోల్లో ఒకరు నాగార్జున ( Nagarjuna )గారు…నాగార్జున ఒక జానర్ అని కాకుండా దాదాపు అన్ని జానర్స్ లో సినిమాలు చేస్తూ హిట్లు కొడుతుంటారు.కెరీయర్ స్టార్టింగ్ లోనే చాలా ప్రయోగాత్మకమైన సినిమాలు చేసారు.
నాగార్జున నిన్నే పెళ్లాడుతా లాంటి ఫ్యామిలీ సినిమాలు తీస్తూనే, అన్నమయ్య లాంటి భక్తిరస చిత్రాలు తీశారు.ఇది ఇలా ఉంటె ప్రస్తుతం నాగార్జున ప్లాపుల్లో ఉన్నారు ప్రవీణ్ సత్తార్ లాంటి దర్శకుడితో ఘోస్ట్ అనే సినిమా తీసి ప్లాప్ ని మూటగట్టుకున్నారు.
నాగార్జునకి ఇప్పుడు అర్జెంట్ గా ఒక హిట్ కావాలి.అందుకే నాగార్జున మరోసారి యాక్షన్ చిత్రాన్ని తీయడానికి సిద్ధం అవుతున్నాడు.
అయితే, ఈసారి వచ్చే సినిమా మల్టీస్టారర్ గా ఉండబోతోంది అని తెలుస్తుంది.

నాగార్జునతో పాటు అల్లరి నరేష్( Allari Naresh ) ఈ సినిమాలో నటించబోతున్నాడు.ఇప్పటికె మూడు మల్టీస్టారర్ సినిమాల్లో నటించిన నరేష్, అన్నింట్లో సూపర్ హిట్ సాధించాడు.ఇది ఇలా ఉంటె రీసెంట్ గా రవితేజ హీరో గా చేసిన ధమాకా సినిమా కి రైటర్ గా చేసిన ప్రసన్న కుమార్ బెజవాడని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ నాగార్జున ఈ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.
త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.

ఈ సినిమాలో హీరోతో సమానమైన పాత్రని అల్లరి నరేష్ పోషించబోతున్నాడు.సినిమాకు సంబంధించిన చర్చలు ఇప్పటికే ముగిశాయి.ఈ సినిమా యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్ లో ఉండనుంది.
ఈ సినిమాకు టైటిల్ తో పాటు ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.అయితే ప్రస్తుతం అల్లరి నరేష్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు…

ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా తో పాటు తమిళ్ హీరో అయిన సూర్య తో( Suriya ) కూడా ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది…ఒక కొత్త డైరెక్టర్ తో సూర్య సినిమా సినిమా చేస్తున్నాడు దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉండటంతో వాళ్ళు నాగార్జున ని సంప్రదించినట్లు తెలుస్తుంది.స్టోరీ నచ్చిన నాగార్జున ఈ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గా తెలుస్తుంది…
.