అజయ్ దేవగణ్ రోల్ చేయనున్న నాగ్, కానీ

టాలీవుడ్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.ఆరు పదుల వయసులో కూడా అదే గ్లామర్ మైంటైన్ చేస్తూ అమ్మాయిల గుండెల్లో మన్మధ బాణాలు వేస్తూ ఉంటాడు.

 Nagarguna Will Do Next Movie With Garudavega Director-TeluguStop.com

ఆయన టాలీవుడ్ లో చివరిగా మన్మధుడు 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అది పెద్దగా హిట్ అవ్వలేదు.ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’చిత్రం తో బిజీ గా ఉన్న నాగ్ చేతికి మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చినట్లు తెలుస్తుంది.

గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నాగ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండనున్నట్లు తెలుస్తుంది.ఇందులో నాగ్ ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది.

అయితే ఈ చిత్రం లో నాగ్ క్యారెక్టర్ బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్ర లో తెరకెక్కిన రైడ్ మూవీ తరహాలో ఉంటుందట.కానీ ఈ చిత్రం రైడ్ కి రీమేక్ కాదని తెలుస్తుంది.

కేవలం ఈ చిత్రంలో నాగ్ క్యారెక్టర్ అజయ్ దేవగణ్ పాత్ర తరహాలో ఉంటుందని సమాచారం.చాలా గ్యాప్ తరువాత హీరో రాజశేఖర్ కు మంచి బ్రేక్ ఇచ్చిన గరుడ వేగ చిత్ర దర్శకుడి తో నాగ్ తదుపరి చిత్రం ఉండబోతుండడం తో ఆయన అభిమానులు భారీ అంచనాలను పెట్టుకుంటున్నారు.

ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తార్ సొంత కధతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది.మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మిస్తున్న వైల్డ్ డాగ్ చిత్రం లో నాగ్ ప్రస్తుతం నటిస్తున్నారు.

ఈ చిత్రానికి అహిషోర్‌ సాల్మోన్‌ దర్శకుడు కాగా ఈ సినిమాలో నాగార్జున వైల్డ్‌డాగ్‌ విజయ్‌ వర్మ అనే పోలీస్‌ అధికారిగా కనిపించబోతున్నట్లు సమాచారం.యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రహస్య పోలీస్‌ ఆపరేషన్‌లో విజయ్‌వర్మకు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయన్నది ఈ సినిమాలో అద్భుతంగా చూపించనున్నారు దర్శకుడు.

ఇంకా ఈ చిత్రం చేస్తున్న నాగ్ చేతికి ఇప్పుడు ఈ ప్రవీణ్ సత్తార్ ప్రాజెక్ట్ రావడం తో అందరి అంచనాలు పెరిగిపోయాయి.ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇంకా అధికారిక ప్రకటన కూడా విడుదలకావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube