అప్పుడు మార్గ నిర్దేశం చేసాను.. ఇప్పుడు తన అడుగుజాడల్లో నడుస్తున్నా: నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) ఇంట్లో తన కుమారుడు వరుణ్ తేజ్ (Varun Tej) నిశ్చితార్థ వేడుక ఎంతో ఘనంగా జరిగిన విషయం మనకు తెలిసిందే.గత కొంతకాలంగా వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠితో (Lavanya Tripati) ప్రేమలో ఉన్నారు.

 Nagababu Shares Emotional Post On Pawan Kalyan Details, Nagababu,varun Tej,lavan-TeluguStop.com

ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ ఇద్దరు ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది.ఈ క్రమంలోనే జూన్ 9వ తేదీ నాగబాబు ఇంట్లో కేవలం మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ సమక్షంలో లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ నిశ్చితార్థ (Engagment) వేడుక ఎంతో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా హాజరయ్యారు.

Telugu Janasena, Lavanya Tripati, Nagababu, Nagababupawan, Pawan Kalyan, Varun T

ఇలా పవన్ కళ్యాణ్ ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారని చెప్పాలి.సరికొత్త లుక్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే పవన్ కళ్యాణ్ తో కలిసి నాగబాబు దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఒక పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇందులో పవన్ కళ్యాణ్ ముందు నడుస్తూ ఉండగా నాగబాబు తన వెనుక నడుస్తూ ఉన్నారు.

Telugu Janasena, Lavanya Tripati, Nagababu, Nagababupawan, Pawan Kalyan, Varun T

ఈ ఫోటోని షేర్ చేసిన నాగబాబు…చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ కు ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలి అనే విషయాల గురించి తాను మార్గ నిర్దేశం చేసానని, అయితే ఇప్పుడు ఇద్దరం పెద్దవాళ్ళు అయ్యాం.పవన్ ఏటు వైపు వెళ్ళాలి, ఏం చేయాలి అనే విషయాల గురించి తనకు లోతైన అవగాహన ఉంది అంటూ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆ మార్గంలోనే వెళ్తున్నారని నేను తన అడుగుజాడల్లోనే వెళుతున్నానని నాగబాబు ఈ సందర్భంగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ(Janasena Party) ని స్థాపించిన విషయం మనకు తెలిసిందే.

పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నాగబాబు పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube