పవన్ అప్పులు చేసి ఆస్తులు కొన్నారట.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు!

నేడు స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.పవన్ బర్త్ డే కావడంతో తెలుగు రాష్ట్రాలలో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి.

 Nagababu Sensational Comments About Pawan Kalyan Properties Details Here , Naga-TeluguStop.com

తమ్ముడు, జల్సా సినిమాలు రీరిలీజ్ కావడం కూడా అభిమానుల ఆనందానికి ఒక విధంగా కారణమైంది.భవిష్యత్తులో ఖుషి సినిమా 4కే ప్రింట్ రీరిలీజ్ చేయాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈ మధ్య కాలంలో పవన్ ఆస్తుల గురించి ఎన్నో వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి.

తాజాగా నాగబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలను బ్యాలెన్స్ చేయడం సులువైన విషయం కాదని ఆయన అన్నారు.

మాకు తాతలు సంపాదించిన వేల కోట్ల రూపాయల ఆస్తులేం లేవని ఆయన తెలిపారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోల కంటే పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎక్కువని ఆయన కామెంట్లు చేశారు.

అయినప్పటికీ పవన్ కళ్యాణ్ దగ్గర ఇంత ఆస్తి ఉందని చెప్పుకునే పరిస్థితి లేదని నాగబాబు తెలిపారు.

పవన్ కళ్యాణ్ వచ్చిన డబ్బంతా రాజకీయాలకు, సేవా కార్యక్రమాల కోసమే ఖర్చు చేస్తున్నారని నాగబాబు అన్నారు.

డబ్బును మాత్రం పవన్ దాచిపెట్టి ఆస్తులు కొనుగోలు చేయరని నాగబాబు తెలిపారు.శంకర్ పల్లిలో పవన్ ఎప్పుడో కల్టివేట్ చేద్దామని 8 ఎకరాలు కొనుగోలు చేశారని ఆ ల్యాండ్ విలువ పెరిగిందని నాగబాబు చెప్పుకొచ్చారు.

ఈ మధ్య కాలంలో పవన్ ఇల్లు కొన్నారని అయితే పవన్ ఎన్ని కొన్నా ఫైనాన్స్ తీసుకుని కొన్నారని నాగబాబు తెలిపారు.

Telugu Chiranjeevi, Khushi, Naga Babu, Nagababu, Pawan Kalyan-Movie

ప్రతి నెలా వాయిదాల పద్ధతిలో పవన్ కళ్యాణ్ డబ్బు చెల్లిస్తూ అప్పు తీరుస్తున్నారని నాగబాబు కామెంట్లు చేశారు.పవన్ కళ్యాణ్ దగ్గర సాలిడ్ గా బ్యాంక్ బ్యాలెన్స్ అయితే లేదని నాగబాబు చెప్పుకొచ్చారు.చిరంజీవి, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తారని మొదట నాకు తెలియదని నాగబాబు వెల్లడించారు.

పవన్ ఆస్తులకు సంబంధించి నాగబాబు సంచలన విషయాలను వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube