వరుణ్ తేజ్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన నాగబాబు.. అమ్మాయి ఎవరంటే?

మెగా హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.

ఒక హీరోయిన్ తో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

నాగబాబు మాట్లాడుతూ పవన్ పై అలీ చేసిన కామెంట్లను నేను సీరియస్ గా తీసుకోలేదని తెలిపారు.పవన్ కళ్యాణ్ ను అలీ కూతురి పెళ్లికి పిలిచాడని ఆయన కామెంట్లు చేశారు.

పవన్ అలీ రాజకీయంగా వేర్వేరు పార్టీలలో ఉన్నారని తెలిపారు.అన్నయ్య నేను కళ్యాణ్ బాబు కలిసి నటిస్తామని మంచి కథ దొరికితే సిద్ధమేనని పరోక్షంగా తెలిపారు.

చిరంజీవి, పవన్ లకు సమానంగా నేను నటించలేనని ఆయన కామెంట్లు చేశారు.చిరంజీవికి తండ్రి పాత్రలో నేను నటించినా కనెక్ట్ కాదని నాగబాబు అన్నారు.

Advertisement

గడ్డం పెంచడం నాకే చిరాకుగా ఉందని ఆయన కామెంట్లు చేశారు.

ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల సినిమాలో నేను నటిస్తున్నానని నాగబాబు చెప్పుకొచ్చారు.ప్రస్తుతం నిహారిక వేర్వేరు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారని నాగబాబు అన్నారు.ఒక వెబ్ సిరీస్ కోసం నిహారిక డేట్స్ అడిగిందని ఆయన తెలిపారు.

నిహారికకు ప్రొడక్షన్ అంటే చాలా ఇష్టమని తను ప్రూవ్ చేసుకుందని యూత్ కు నచ్చే కథలు తనకు బాగా తెలుసని నాగబాబు కామెంట్లు చేయడం గమనార్హం.

నిహారిక తన లైఫ్ తనే లీడ్ చేస్తోందని ఆయన కామెంట్లు చేశారు.ప్రొడక్షన్ కోసం అప్పుడప్పుడూ అప్పు తీసుకుంటోందని నాగబాబు తెలిపారు.వరుణ్ తేజ్ డబ్బులు నేను తీసుకోనని నాగబాబు అన్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

వరుణ్ తేజ్ పెళ్లి గురించి త్వరలో ప్రకటన వస్తుందని వరుణ్ తేజ్ నుంచి పెళ్లికి సంబంధించి క్లారిటీ వస్తుందని ఆయన తెలిపారు.ఒక వ్యక్తి కోడలు కాబోతుందని వైరల్ అయిన వార్త నిజమో కాదో తాను ఇప్పుడు చెప్పనని లావణ్య త్రిపాఠి గురించి పరోక్షంగా నాగబాబు కామెంట్ చేశారు.

Advertisement

ఈ ఏడాదే వరుణ్ తేజ్ పెళ్లి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

తాజా వార్తలు