జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్లే దేవర మూవీ హిట్టైందా.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

టాలీవుడ్ హీరో ఎన్టీఆర్(Hero NTR) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎన్టీఆర్ (Ntr)ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

అందులో భాగంగానే ఇటీవలే దేవర (Devara)సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.భారీ అంచనాల నడుమ విడుదలైన దేవర సినిమా మంచి సక్సెస్ అయిన విషయం తెలిసిందే.

ఇకపోతే తారక్ నటించిన దేవర సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ అభిమానులు మామూలోళ్లు కాదు అనాల్సిందే.అంతే కాదండోయ్ ఫ్యాన్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు.

ఈ విషయాన్ని ఎన్టీఆర్ కూడా స్వయంగా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.దేవర ను రిలీజ్ చేసిన నిర్మాత నాగవంశీ (Producer: Naga Vamsi)కూడా అదే చెబుతున్నారు.

Advertisement

ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవర విజయంపై ఎదురయ్యే ప్రశ్నలకు సరదాగా ఆన్సర్ ఇచ్చారు.నేను ఎంత సేఫ్ గా దేవర ను ల్యాండ్ చేసానో.తారక్ గారి ఫ్యాన్స్ కొన్ని లక్షల మంది దేవర చిత్రాన్ని అంతగా ఓన్ చేసుకుని, హ్యాండిల్ చేస్తూ దానికి మోశారు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్(NTR Fans) ని నిర్మాత నాగవంశీ పొగిడేశారు.

నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూనుకోపోతే దేవర చిత్రం ప్లాప్ దిశగా పయనించేది అని ఆయన తెలిపారు.దేవర చిత్రం విడుదలయ్యాక వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా దేవర కలెక్షన్స్ మోత మోగించింది.

అదంతా కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్లే సాధ్యమైంది అని ఎన్టీఆర్ కూడా చాలా గర్వంగా చెబుతున్నమాట.అటు నాగవంశీ కూడా అదే చెప్పారు.ఇది చూస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగా ప్రాణం పెడితే కానీ దేవర హిట్ అవ్వలేదు, ఇది నిజమంటున్నారు విశ్లేషకులు.

ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.కొందరు ఈ వార్తలపై పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు ఒక ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రతి ఒక్క హీరో అభిమాని ఫోన్ చేసుకుని హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టే సినిమాకు అన్ని కోట్లు వస్తున్నాయి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

హీరోలు ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తారు.. కిచ్చా సుదీప్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు