అరుదైన రికార్డును సొంతం చేసుకున్న నాగచైతన్య..?

కరోనా, లాక్ డౌన్ నిబంధల వల్ల గతేడాది దాదాపు ఏడు నెలల పాటు థియేటర్లు మూతబడిన సంగతి తెలిసిందే.

గత నెల 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకోగా సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రమే ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

సినిమాకు ఏ మాత్రం ఫ్లాప్ టాక్ వచ్చినా దారుణంగా కలెక్షన్లు వస్తున్నాయి.ఈ ఏడాది విడుదలైన సినిమాలలో నాలుగు సినిమాలు మినహా మిగిలిన సినిమాలన్నీ బ్రేక్ ఈవెన్ కాకపోవడం వల్ల ఫ్లాప్ గా నిలిచాయి.

అయితే ఇలాంటి తరుణంలో కూడా లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తో నాగచైతన్య అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.లవ్ స్టోరీ మూవీ థియేట్రికల్ హక్కులు 30 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడయ్యాయి.

మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నాగచైతన్య సినిమా సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ జరగడం సాధారణమైన విషయం కాదనే చెప్పాలి.ఈ విధంగా హీరో నాగచైతన్య ఖాతాలో అరుదైన రికార్డు చేరింది.

Advertisement

మరోవైపు లవ్ స్టోరీ సినిమా పాటలు కూడా విడుదలకు ముందే బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. సారంగదరియా పాట వివాదాల వల్ల వార్తల్లో నిలిచినా ఆ పాటకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.

ఈ పాట వీడియో సాంగ్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది.మంగ్లీ ఫుల్ జోష్ తో సారంగదరియా పాట పాడగా సాయిపల్లవి డ్యాన్స్ తో సాంగ్ సూపర్ హిట్ అయ్యేలా చేశారు.

లవ్ స్టోరీ సినిమా విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తుండగా విడుదలైన తర్వాత ఈ సినిమా ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.ఏప్రిల్ నెల 16వ తేదీన లవ్ స్టోరీ సినిమా విడుదల కానుంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు