ఇటు సినిమాలు... అటు వెబ్ సిరీస్ లు..అల్లాడిస్తున్న నాగ చైతన్య

ఒక్కసారి హీరోలుగా సక్సెస్ అందుకున్న తర్వాత ఎవరికైనా కూడా డిజిటల్ వైపు అడుగులు వేసి వెబ్ సిరీస్లలో నటించాలని అనిపించదు కానీ ఈ విషయంలో నాగచైతన్య( Naga Chaitanya ) అందరికన్నా ముందు అడుగు వేసి సక్సెస్ అయ్యాడు సినిమాల్లో పరాజయాలు అందుకుంటున్న నాగచైతన్య ప్రయోగాత్మకంగా దూత( Dhootha ) అనే ఒక వెబ్సైట్ తో ప్రేక్షకులను పలకరించగా ఇది మంచి విజయాన్ని అందుకుంది విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మొట్టమొదటిసారిగా నాగచైతన్య డిజిటల్ రంగంలోకి అడుగులు వేశాడు అయితే దీని సక్సెస్ తర్వాత దూత సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్.దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతుంది.

 Naga Chaitanya Upcoming Movies Details, Naga Chaitanya, Naga Chaitanya Movies, N-TeluguStop.com
Telugu Akkineninaga, Dhootha Web, Karthikvarma, Naga Chaitanya, Nagachaitanya, P

అయితే ఇలా వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్నా నాగచైతన్య మరోవైపు సినిమాలతో కూడా అదే రేంజ్ లో బిజీగా ఉన్నాడు.హిట్స్, ఫ్లోస్ సంగతి పక్కన పెట్టి ఆయన వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు ప్రస్తుతం సాయి పల్లవి హీరోయిన్గా నాగచైతన్య హీరోగా తండేల్( Thandel ) అనే సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక దూత షూట్ లో పాల్గొనబోతున్నాడట నాగచైతన్య.అక్టోబర్ లో తండేల్ సినిమా విడుదలయ్యాక విరుపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో( Karthik Dandu ) ఒక సినిమా చేయడానికి నాగచైతన్య ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ చిత్రానికి ఇప్పటికే పూజా హెగ్డే హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశారట.గతంలో ఒక లైలా కోసం అనే చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు.

Telugu Akkineninaga, Dhootha Web, Karthikvarma, Naga Chaitanya, Nagachaitanya, P

ఇలా వరుస సినిమాలతో పాటు డిజిటల్ రంగంలో కూడా సక్సెస్ అవ్వడం అనేది కేవలం నాగచైతన్యకే చెల్లింది.భవిష్యత్తులో మరిన్ని డిజిటల్ కంటెంట్ తీయడానికి నాగచైతన్య సిద్ధంగా ఉన్నట్టు కూడా సమాచారం అయితే దూత 2 మాత్రం చాలా గ్రాండ్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల చేయాలనే ప్లాన్స్ లో ఉన్నారట మేకర్స్.ఇక సినిమాల్లో విజయాలయితే లేవు కానీ దూత విజయంపై నాగ చైతన్యతో పాటు అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు.దూత 2 కూడా విజయం సాధించాలని అందరూ కోరుకుంటున్నా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube