భారతీయ విద్యార్ధుల మరణాలు .. అమెరికాలోని ఇండియన్ ఎంబసీ అవగాహనా కార్యక్రమం

గడిచిన కొద్దినెలలుగా అమెరికాలో భారతీయ విద్యార్ధుల( Indian Students ) హత్యలు, ఆకస్మిక మరణాలు, భౌతికదాడుల నేపథ్యంలో పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే అగ్రరాజ్యానికి వెళ్లినవారితో పాటు అమెరికా( America ) వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న వారిని కూడా ఈ పరిణామాలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

 Indian Embassy In Dc Advocates Stronger Us-india Education Collaboration Amid Sa-TeluguStop.com

మరోవైపు.భారతీయులు, భారత సంతతికి చెందిన వ్యక్తులు , విద్యార్ధులపై వరుస దాడుల నేపథ్యంలో వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం , అమెరికాలోని పలు నగరాల్లో వున్న భారత కాన్సులేట్‌లు అప్రమత్తమయ్యాయి.

దేశం నలుమూలల నుంచి వచ్చిన భారతీయ విద్యార్ధులతో వర్చువల్ ఇంటరాక్షన్‌ని నిర్వహించేందుకు , విద్యార్ధుల శ్రేయస్సు, వివిధ అంశాలను చర్చించడానికి చొరవ తీసుకున్నాయి.

ఛార్జ్ డి ఎఫైర్స్ అంబాసిడర్ శ్రీప్రియా రంగనాథన్( Sripriya Ranganathan ) నేతృత్వంలో 90 అమెరికా యూనివర్సిటీల నుంచి దాదాపు 150 మంది ఇండియన్ స్టూడెంట్ అసోసియేన్( Indian Student Association ) ఆఫీస్ బేరర్లు, విద్యార్ధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అట్లాంటా, చికాగో, హ్యూస్టన్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, సీటెల్‌లోని భారత కాన్సుల్ జనరల్స్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.భారత్, యూఎస్ మధ్య విజ్ఞానం, పరిశోధన భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి ముఖ్యమైన అవకాశాలను భారత రాయబార కార్యాలయం నొక్కి చెప్పింది.

ఈ సహకార ప్రయత్నం విద్యా కార్యాక్రమాలను మెరుగుపరచడం, అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్ధుల శ్రేయస్సును ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

Telugu America, Eric Garcetti, India, Indian Embassy, Indian, Safety Concerns, W

కాగా.అమెరికాలో భారత విద్యార్ధుల మరణాల పట్ల కొద్దిరోజుల క్రితం భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి( Eric Garcetti ) స్పందించారు.అమెరికా విద్యార్ధులు అప్రమత్తంగా వుండాలని, తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.

విద్యార్థులు తోటివారితో సన్నిహితంగా వుండాలని, క్యాంపస్‌లోని భద్రతా వనరులను ఉపయోగించుకోవాలని ఎరిక్ గార్సెట్టి పునరుద్ఘాటించారు.

Telugu America, Eric Garcetti, India, Indian Embassy, Indian, Safety Concerns, W

మీడియా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో .భారతీయ విద్యార్ధుల విషయంలో జరిగిన ఘటనలను అంగీకరించారు.కొన్ని బాధిత కుటుంబాలతో తాను మాట్లాడానని .న్యాయపరమైన అంశాలను తీవ్రంగా పరిగణిస్తామని గార్సెట్టి తెలిపారు.బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన .వారికి న్యాయం జరిగేలా , నిందితులను చట్టం ముందు నిలబెట్టడంలో అమెరికా ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరిస్తుందని చెప్పారు.ప్రభుత్వం జారీ చేసిన అడ్వైజరీలను పాటించాలని గార్సెట్టి సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube