మామూలుగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలు మూడు పదులు వయసు, నాలుగు పదుల వయసు దాటిన తర్వాత పెళ్లి చేసుకోవాలనీ ఎక్కువగా భావిస్తూ ఉంటారు.ఐదు పదుల వయసు దాటిన ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్న వారు చాలామంది ఉన్నారు.
అందుకే పెద్దలు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు.కానీ కొంతమంది హీరోయిన్లు ఇలాంటి మాటలు పట్టించుకోరు.
వీఅలాంటి వారిలో సుశ్మితా సేన్( Sushmita Sen ) కూడా ఒకరు.ఈమెకు పెళ్లీడు దాటి దశాబ్ద కాలం అయ్యింది.
అయినప్పటికీ ఆమె ఇంకా తన పెళ్లిపై స్పందిస్తూనే ఉంది.

త్వరలోనే పెళ్లి అంటూ ఊరిస్తోంది.నేను కచ్చితంగా పెళ్లి ( Marriage ) చేసుకుంటాను.కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కాస్త కఠినంగా, గందరగోళంగా అనిపిస్తోంది.
కానీ ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటాను.సరైన వ్యక్తి దొరికితే, నేను కోరుకున్న అన్ని లక్షణాలు అతడిలో ఉంటే పెళ్లాడ్డానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని తెలిపింది సుస్మిత.
గతంలో రణదీప్ హుడాతో( Randeep Hooda ) డేటింగ్ చేసింది సుశ్మితా సేన్.ఆ తర్వాత అతడి నుంచి విడిపోయి రోహమన్ షాల్ కు( Rohman Shawl ) దగ్గరైంది.
దాదాపు మూడేళ్ల పాటు అతడితోనే గడిపింది.ఆ తర్వాత వాళ్లిద్దరూ విడిపోయారు.
కొన్నాళ్లు ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోడీతో( Lalit Modi ) కూడా కలిసి కనిపించింది సుస్మితా సేన్.

వీళ్లందర్నీ తన ఎక్స్-బాయ్ ఫ్రెండ్స్ గా చెప్పుకొచ్చిన సుశ్మిత సేన్, మాజీ ప్రియులంతా ప్రస్తుతం తనకు స్నేహితులుగా కొనసాగుతున్నారని, అది తనకు పెద్ద వరమని చెబుతోంది.ఏ వ్యక్తితో ఎంత వరకు ఉండాలనే గీత స్పష్టంగా ఉన్నప్పుడు జీవితం సాఫీగా సాగిపోతుందని చెబుతోంది.ప్రస్తుతం సుశ్మితా సేన్ వయసు 48 సంవత్సరాలు.
ఈ వయసులో మళ్లీ పెళ్లి అనే ఆమె అని మాట్లాడటంతో ఈ వయసులో పెళ్లి ఏంటి మైండ్ పని చేస్తోందా లేదా అంటూ మండిపడుతున్నారు.







