తాజాగా నాగచైతన్య( Naga Chaitanya ) ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు అని వార్తలు అయితే వస్తున్నాయి.
కారణం వరుస ఫ్లాప్ లని చెప్పాలి.ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి మంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు నాగచైతన్య.
కానీ ఇప్పటివరకు కూడా అటువంటి సక్సెస్ ను అందుకునేలేదని చెప్పాలి.ఒక స్టార్ హీరో కొడుకు అయినప్పటికీ కూడా ఆయనకు అంతగా కలిసి రావట్లేదు.
అయితే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడమే కాకుండా మరో దారిలో నడవాలని చూస్తున్నట్టు తెలిసింది.ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తొలిసారిగా నాగచైతన్య 2009లో జోష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.
తర్వాత తమిళ మూవీ లో కూడా నటించాడు.
ఇక 2017లో ఏ మాయ చేసావే సినిమాలో నటించగా ఈ సినిమాలో కూడా తన నటనతో మంచి మార్కులు సంపాదించుకున్నాడు.ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది.
ఇందులో తన మాజీ భార్య సమంత( Samantha ) కూడా నటించిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత 100% లవ్, దడ, బెజవాడ, ఆటోనగర్ సూర్య, మనం, ఒక లైలా కోసం, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం ఇలా పలు సినిమాలలో నటించగా కొంత వరకు మంచి సక్సెస్ అందుకున్నాడు.ఇక కొన్ని సినిమాలు మాత్రం చాలా తక్కువగా గుర్తింపుని ఇచ్చాయి.ఇక మంచి హోదాలో ఉన్న సమయంలో నాగచైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లి తర్వాత కూడా ఇద్దరు పలు సినిమాలలో నటించారు.టాలీవుడ్ లో ఈ జంట చూడముచ్చటగా కనిపించింది.కానీ అంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు విడాకుల పేరుతో షాక్ ఇచ్చారు.విడాకుల తర్వాత ఇద్దరు ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్లుగా బతుకుతున్నారు.ఇక గత కొన్ని రోజుల నుండి నాగచైతన్య మరో హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల( Sobhita dhulipala )తో రిలేషన్ షిప్ లో ఉన్నాడని జోరుగా వార్తలైతే వస్తున్నాయి.

అయితే ఇదంతా పక్కన పెడితే ఇటీవలే నాగచైతన్య కస్టడీ ( Custody )సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.కానీ ఈ సినిమా కూడా అంత సక్సెస్ కాలేక పోయింది.దీంతో ఆశలు పెట్టుకున్న సినిమాలన్నీ ఇలా కావడంతో నాగచైతన్య ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడట.
అదేంటంటే తను మరో మూడు సినిమాలు మాత్రమే చేస్తాడట.
ఇక ఆ సినిమాలు హిట్ అయితే నటుడుగా అలాగే కొనసాగుతాడట.
ఒకవేళ హిట్ కాకపోతే సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి బిజినెస్ వైపు అడుగులు వేయాలని అనుకుంటున్నాడని తెలిసింది.అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం బాగా వైరల్ అవుతుంది.
దీంతో కొంతమంది నీకు మీ తమ్ముడికి సినిమాలలో కలిసి రాదు.ఇద్దరూ సినిమాలకు దూరంగా ఉండి వేరే బిజినెస్ చేసుకోండి అంటూ సలహాలు ఇస్తున్నారు.







