అక్కినేని హీరో నాగచైతన్య( Naga Chaitanya ) నక్క తోక తొక్కారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తుంది.
తండేల్ సినిమా( Thandel Movie ) రైట్స్ పరంగా నాగచైతన్య కెరీర్ లోనే సంచలనం సృష్టించడం హాట్ టాపిక్ అవుతోంది.
నాగచైతన్య సినిమా డిజిటల్ హక్కులు ఏకంగా 40 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.సాయిపల్లవి, చందూ మొండేటి క్రేజ్ కూడా కలిసొచ్చి ఈ సినిమా రైట్స్ ఇంత మొత్తానికి అమ్ముడైనట్టు తెలుస్తోంది.
కార్తికేయ 2 సినిమా తర్వాత చందూ మొండేటి( Chandoo Mondeti ) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడం ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయింది.ఇప్పటికే విడుదలైన తండేల్ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
తండేల్ డిజిటల్ రైట్స్( Thandel Digital Rights ) భారీ మొత్తానికి అమ్ముడైన నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రం చైతన్య దశ తిరిగినట్లేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.దేశభక్తి అంశాలకు కూడా ఈ సినిమాలో ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.
నాగచైతన్య ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సాయిపల్లవి( Sai Pallavi ) కొంతకాలం గ్యాప్ తర్వాత తండేల్ సినిమాతో లక్ పరీక్షించుకుంటున్నారు.రా రస్టిక్ ప్రేమ కథతో తెరకెక్కుతుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.
చైతన్య గతంలో ఎప్పుడూ పోషించని పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది.
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా ఒకింత స్పెషల్ గా ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది.తండేల్ సినిమా డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
తండేల్ సినిమా ఇతర భాషల ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.ఈ సినిమా చై, సాయిపల్లవి రేంజ్ ను మరింత పెంచుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy