అక్కినేని నాగచైతన్య( Nagachaitanya ) త్వరలోనే దూత( Dhootha ) అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ఇప్పటివరకు కేవలం సినిమాలలో నటించినటువంటి నాగచైతన్య మొట్టమొదటిసారి వెబ్ సిరీస్లలో కూడా నటించారు.ఇప్పటికే దూత వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
ఇక ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ ఒకటవ తేదీ అన్ని భాషలలోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.
విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకేక్కినటువంటి ఈ వెబ్ సిరీస్ నుంచి ఇప్పటికి విడుదల చేసినటువంటి ట్రైలర్ ఆద్యంతం ఈ సిరీస్ పై అంచనాలను పెంచేస్తోంది.ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాగచైతన్యకు ఎన్నో రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి.ముఖ్యంగా ది ఫ్యామిలీ మెన్ (The Family Man) వెబ్ సిరీస్ చేసిన తర్వాత సమంత(Samantha) కు నాగచైతన్యకు మధ్య గొడవలు వచ్చాయని ఈ గొడవలు కారణంగానే వీరిద్దరు విడిపోయారు అంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి అయితే తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇప్పటివరకు వచ్చిన ఇండియన్ వెబ్ సిరీస్ లలో మీకు నచ్చినటువంటి వెబ్ సిరీస్ ఏది అనే ప్రశ్న ఎదురయింది.అయితే ఈ ప్రశ్నకు ఏమాత్రం ఆలోచించకుండా నాగచైతన్య వెంటనే ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ నా మనసును కదిలించింది అంటూ ఈయన సమాధానం చెప్పారు.దీంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.వీరి విడాకులకు కారణమైనటువంటి ఈ వెబ్ సిరీస్ అంటే తనకు ఇష్టమా అంటూ ఆశ్చర్యపోతున్నారు అయితే విడాకులు తీసుకున్న తర్వాత సమంత నాగచైతన్య గురించి ఎప్పుడూ ఎక్కడా మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు కానీ సమంత గురించి మాత్రం నాగచైతన్య ఎంతో పాజిటివ్ గా గొప్పగా మాట్లాడుతూనే ఉన్నారు తాజాగా చైతూ ది ఫ్యామిలీ మెన్ సిరీస్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.