నాగ చైతన్య హీరో గా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం లో రూపొందుతున్న కస్టడీ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు మీడియా కు సమాచారం అందించారు.ఈ సినిమా తెలుగు తో పాటు తమిళం లో కూడా ఏక కాలం లో చిత్రీకరణ జరుపుతున్నారట.
తమిళం కోసం వేరే నటీనటులు నటిస్తున్నారని సమాచారం అందుతుంది.వెంకట్ ప్రభు సినిమా లకు తమిళనాట మంచి ఆదరణ ఉంటుంది.
కనుక కచ్చితం గా ఈ సినిమా తో తమిళ నాట నాగ చైతన్య జండ పాతడం ఖాయం అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను వచ్చే ఏడాది మే నెల లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒక వేళ మే నెల లో సినిమా ను విడుదల చేయలేకపోతే జూన్ నెల లో ఖచ్చితం గా సినిమా ను విడుదల చేయాలి అనే ఉద్దేశం తో చిత్ర యూనిట్ సభ్యులు శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నారు అంటూ సమాచారం అందుతుంది.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో హీరోయిన్ గా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తున్న విషయం తెలిసిందే.
ఆమె నటించిన వరుసగా మూడు సినిమా లు సూపర్ హిట్ అయ్యాయి.ఆ తర్వాత వరుసగా మూడు సినిమా లు ఫ్లాప్ అయ్యాయి.మరి ఈ సినిమా ఆమె కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూడాలి.నాగ చైతన్య ను ఈ సినిమా లో చాలా విభిన్నమైన రోల్ లో చూడబోతున్నాం అంటూ అక్కినేని అభిమానులకు చిత్ర యూనిట్ సభ్యులు హామీ ఇస్తున్నారు.
ఇప్పటికే చైతూ మరియు కృతి లు కలిసి బంగార్రాజు సినిమా లో నటించారు.ఆ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంది.