సాయి పల్లవి సినిమాలకు పూర్తిగా గుడ్‌ బై చెప్పినట్లేనా?

ప్రేమమ్‌ సినిమా తో మలయాళం ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ సాయి పల్లవి ఆ తర్వాత తెలుగులో ఫిదా సినిమా తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.తెలుగు లో వరుసగా సినిమా లు చేస్తున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి స్టార్ హీరోయిన్ అయిపోయినట్లే అంటూ అంతా భావించారు.

 Sai Pallavi Fans Are Unhappy With Her Movies Selection Details, Fida Movie, Sai-TeluguStop.com

కానీ అనూహ్యం గా సాయి పల్లవి సినిమా లకు బ్రేక్ వేసింది.ఆమె ఇప్పటి వరకు చేసిన సినిమాలు కాకుండా గత ఆరు నెలల కాలం గా ఏ ఒక్క సినిమా కు కొత్తగా ఓకే చెప్పిందే లేదు అంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

మూడు నుండి ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిన కూడా సాయి పల్లవి సినిమా లు ఒప్పుకోవడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.ఆ మధ్య ఒక టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సినిమా లు కీలక పాత్ర లో నటించాల్సిందిగా ఆమె కు ఆఫర్ వచ్చిందంట.

కానీ ఆమె సున్నితంగా సినిమా ఆఫర్ ని తిరస్కరించిందట.ఆ స్టార్ హీరో మాట్లాడినప్పటికీ దయచేసి ఒత్తిడి చేయొద్దు అంటూ విజ్ఞప్తి చేసిందట.కానీ ఆయన కోసం అయినా సినిమా ను చేయలేదట.ఆ స్టార్ హీరో ఒకానొక సందర్భంలో సాయి పల్లవి విషయం లో షాక్ అయ్యాను నేను అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చాడు.

Telugu Fida, Sai Pallavi, Telugu, Tollywood, Top-Movie

అలా సాయి పల్లవి ఇండస్ట్రీ కి దూరం అవుతుంది అంటూ ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాయి పల్లవి సినిమా లు చేసే ఆలోచన తో ఉందా? లేదా? అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ వస్తున్నప్పటికీ ఎందుకు సాయి పల్లవి సినిమా లకు దూరంగా ఉండాలి అనుకుంటుంది అంటూ అంతా ఆసక్తి గా చర్చించుకుంటున్నారు.సరే తెలుగు లో కాకుండా తమిళ్ లేదా హిందీ లో అయినా సినిమాలు చేస్తే బాగుంటుంది కదా.కనీసం మలయాళం లో అయినా సినిమా లు చేయవచ్చు కదా అని కొందరు ఆమె ను ప్రశ్నిస్తున్నారు.మరి దానికి ఆమె సమాధానమేంటో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube