టాలీవుడ్ సినీ నటి గ్లామర్ బ్యూటీ నభా నటేష్.తన అందంతో ఎంతోమంది మనసులను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ తన నటనతో కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది.
తను మోడల్ రంగంలో మంచి పేరు సంపాదించుకుని తరువాత సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది.అంతేకాకుండా కన్నడ సినిమాల్లో కూడా నటించింది.
2015 కన్నడంలో వజ్రకాయ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయము కాగా.2018లో నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగులో పరిచయం అయింది.ఆ తరువాత ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందిని గా అందరిని బాగా ఆకట్టుకుంది.ఇటీవలే సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందిన నభా నటేష్.సోషల్ మీడియాలో తెగ బిజీగా ఉంటుంది.

సోషల్ మీడియాలో తలకు సంబంధించిన ఫోటో లను షేర్ చేస్తూ యువత మనసులను దోచుకున్న ఈ గ్లామర్ బ్యూటీ.సాంప్రదాయ దుస్తులతో, మోడ్రన్ దుస్తులతో అందరినీ ఆకట్టుకుంటుంది.అంతేకాకుండా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉంటూ.కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తుంది.తాజాగా తన అభిమానులతో ఓ ఆట ఆడిన ఈ బ్యూటీ.మీరు ఏదైనా ప్రశ్న అడగండి.
అది నిజమా కాదా అని సమాధానమిస్తా అంటూ తెలిపింది.
దీంతో ఈ ట్రూ ఆర్ ఫాల్స్ గేమ్ లో నెటిజనులు కొన్ని వింత ప్రశ్నలు వేశారు.
మీకు దెయ్యాలు అంటే భయమా అని ఒకరు ప్రశ్నించగా, కాఫీ అంటే ఇష్టమా అని మరొకరు ప్రశ్నించారు.మీరు ఎవరితో నైనా లవ్ లో ఉన్నారా అంటూ చాలా మంది ప్రశ్నించారు.
ఇక మరో నేటి జన్ మీకు బల్లులు అంటే భయమా అని ప్రశ్నించగా.తనకు బల్లులు అంటే భయం లేదంటూ.తను హాస్టల్ లో ఉన్న సమయంలో ఎవరి రూమ్ లోనైనా బల్లులు ఉంటే తీసేయడానికి అందరూ తనని పిలిచేవారు అంటూ చెప్పుకొచ్చింది.