నా పేరు సూర్య మూవీ రివ్యూ

టైటిల్‌: నా పేరు సూర్య‌

 Naa Peru Surya Movie Review-TeluguStop.com

బ్యాన‌ర్‌: రామ‌ల‌క్ష్మి సినీ క్రియేష‌న్స్‌

న‌టీన‌టులు: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, అనూ ఎమ్యాన్యుయేల్‌, శ‌ర‌త్‌కుమార్‌, అర్జున్‌, బొమ‌న్ ఇరానీ త‌దిత‌రులు

కెమేరా: రాజీవ్ ర‌వి

సంగీతం: విశాల్ శేఖ‌ర్‌

కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు

నిర్మాత‌లు: ల‌గ‌డ‌పాటి శిరీషా శ్రీథ‌ర్ – బ‌న్నీ వాస్‌

ద‌ర్శ‌క‌త్వం: వ‌క్కంతం వంశీ

సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ

సినిమా నిడివి : 167 నిమిషాలు

విడుద‌ల తేదీ: 04 మే, 2018

మెగా ఫ్యామిలీ నుంచీ వచ్చిన “స్టైలిష్ స్టార్” అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కి తగ్గట్టుగానే మంచి పేరు తెచ్చుకున్నాడు.ఇప్పుడు ప్ర‌స్తుతం అల్లూ అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో దూసుకుపోతున్నాడు…రేసుగుర్రం సినిమా నుంచీ వచ్చిన దూకుడు కంటిన్యూ అవుతూనే ఉంది…రేసుగుర్రం నుంచి డీజే వ‌ర‌కు బ‌న్నీ చేసిన సినిమాలు అన్ని టాక్‌తో సంబంధం లేకుండా వ‌సూళ్ల వ‌ర్షం కురిపించేస్తున్నాయి.

ఇప్పటి వరకూ బన్నీ తన కెరియర్ లో చేసిన సినిమాలు అన్నీ ఒకెత్తు ఈరోజు రిలీజ్ అయిన నా పేరు సూర్య‌.ఓ కెత్తు.

తన కెరియర్లో నే ఈ సినిమా ఒక మెయిలు రాయిగా నిలుస్తుందని భావిస్తున్నాడు బన్నీ.వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కె.నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా నిర్మించారు.కిక్, టెంపర్, ఎవడు, రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు కథలను అందించి రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ మొదటిసారి ఈ మూవీ తో డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం కాబోతుండడం, అల్లు అర్జున్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్‌గా క‌నిపించ‌డంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోను ఉంది…దీనికి తోడు ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్ ఏకంగా రూ.80 కోట్ల‌కు అమ్ముడుపోయాయి.మరి ఎన్నో అంచనాలతో విడుదల అయ్యిన సూర్య అభిమానులని అలరించాడా.? సగటు ప్రేక్షకుడి కి నచ్చాడా.? అన్నది Telugustop.com విశ్లేషణం లో చూద్దాం

స్టోరీ : సూర్య ( అల్లూ అర్జున్) కి ఆవేశం చాలా ఎక్కువ.విపరీతమైన కోపం కలిగిన సుర్యాకి ఆర్మీలో కి వెళ్ళాలనే కోరిక ఎంతో బలంగా ఉంటుంది.ఎంతో పట్టుదలతో అర్మీలోకి వెళ్ళిన సూర్య అక్కడ కొన్ని పరిణామాల వలన పనిష్మెంట్ కి గురవుతాడు.

అయితే మళ్ళీ ఆర్మీలో చేరడానికి తండ్రి సంతకం తప్పని సరి కావడంతో సూర్యా తండ్రి సైంటిస్ట్ అయిన అర్జున్ వద్దకి వెళ్తాడు.అయితే అక్కడ తండ్రి సంతకం పెట్టడం కోసం సూర్యా కి కొన్ని కండిషన్స్ పెడుతాడు.

అయితే అక్కడ జరిగే అనూహ్యమైన పరిణామాల నేపధ్యంలో…అన్నిటికీ నెగ్గిన సూర్య ఎంతో ఇష్తమైన అర్మీలోకి వెళ్ళడాన్ని వ్యతిరేకిస్తాడు.అయితే సూర్యని ఎందుకు ఆర్మీ అధికారులు సస్పెండ్ చేస్తారు.? తండ్రి సంతకోసం కోసం వచ్చిన సూర్య కి తన తండ్రి ఏమని కండిషన్స్ పెడుతాడు.? ఎంతో ఇష్టమైన అర్మీని వీడి సూర్య ఎందుకు తండ్రి దగ్గర ఉండిపోవాలని అనుకుంటాడు.? మళ్ళీ ఎలా సూర్యా అర్మీలోకి వెళ్తాడు.? అనేది కధ.

విశ్లేషణ

ఇక విశ్లేషణలో కి వెళ్తే .ఎంతో ఆగ్రహం ఉండే సైనికుడి పాత్రలో బన్నీని ప్రెజంట్ చేశాడు వంశీ.అయితే కధ ముందుకు వెళ్ళే కొద్దీ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదని చెప్పాలి.ఫస్ట్ హాల్ఫ్ లో కొంత భాగం ఫ్లాష్ బ్యాక్ మోడ్ తో సాగుతుంది.ఇదిలాఉంటే అర్జున్ బన్నీ తండ్రిగా ఒక సైకలాజికల్ ప్రొఫెసర్ గా ఎంతో స్టైలిష్ గా ఈ సినిమాలో కలిపిస్తారు.ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ని క్యాప్చర్ చేద్దామని దర్శకుడు భావించినా సరే ఆ మేరకు సక్సెస్ అవ్వలేదనే చెప్పాలి.

అయితే ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలకి బ్లాక్ బ్లాస్టర్ సినిమాలకి ఎంతో అద్భుతమైన కధలు అందించిన వంశీ తానూ డైరెక్ట్ చేస్తున్న సినిమాకి మాత్రం కధ ని సరిగా రాసుకోలేడనే చెప్పాలి.

ఎంతో ఎమోషన్స్ తో కూడుకున్న కధ కాబట్టి కనీసం ఎమోషన్స్ అయినా క్యారీ చేసేలా ఉంటే బాగుండేది.

బన్నీ సినిమాలో ఎప్పటిలాగానే యాక్షన్ సీన్స్ బాగుంటాయి ఈ సినిమాలో సైతం యాక్షన్ సీన్స్ కి మంచి మార్కులు ఇవ్వవచ్చు.అయితే కొన్ని కారణాల వలన ఆర్మీలో లో పనిష్మెంట్ ఇచ్చిన తరువాతి నుంచీ కధ వేరే ట్రాక్ ఎక్కుతుంది… ఫ్యామిలీ లవ్ సీన్స్ అన్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చెసినా ఆ సీన్స్ ఆకట్టుకొని విధంగా ఉన్నాయి.

కొన్ని కొన్ని చోట్ల కధ చాలా నెమ్మదిగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది.కొన్ని సందర్భాలలో అయితే తల పట్టుకోవాల్సిందే.

ఇక సెకండ్ హాఫ్ సినిమా బాగుంది అనిపిస్తుంది.అందులో బన్నీ క్యాప్ ట్రిక్స్ మెప్పిస్తాయి.

యాక్షన్ సన్నివేశాలు మినహాయించి ఇతర సన్నివేశాలు కొంచెం రోటిన్ గా అనిపించినా సరే ప్రేక్షకులని మెప్పించారనే చెప్పాలి.అయితే కొన్ని కొన్ని సీన్స్ చలా అనిపిస్తాయి.

ఈ సీన్ బాగుంది అనుకున్న సమయనానికి మరో సీన్ లో ప్రేక్షకుడు డల్ అయిపోతాడు.స్టైలిష్ స్టార్ బన్నీ నుంచి వచ్చిన ఈ సినిమా అభిమానుల అంచనాలని అందుకోలేడనే చెప్పాలి.

మేజర్ గా కథ కథనంలో బలం లేకపోవడం వీక్ పాయింట్.ఒక కథ రచయిత అయిన వక్కంతం వంశీ ఇలాంటి కథను ఎలా ఎంచుకున్నాడు అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది.

ప్లస్ పాయింట్స్ (+)
– అల్లూ అర్జున్ నటన

– బ్యాగ్రౌండ్ మ్యూజిక్

– యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్ (-)

– స్క్రీన్ ప్లే

– పాటలు

– డైరెక్షన్

– కామెడీ

పంచ్ లైన్ – స్టైల్స్ స్టార్ బన్నీ…ఆర్మీ ఆఫీసర్ గా సక్సెస్ కాలేక పోయాడు

రేటింగ్ – 2.5 / 5

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube