టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య బాబు నటించిన వాల్తేరు వీరయ్య,వీరసింహారెడ్డి సినిమాలు తాజాగా సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన విషయం తెలిసిందే.ఇద్దరు అగ్ర హీరోలు నటించిన ఈ రెండు సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అదే రేంజ్ లోనే సొంతం చేసుకుని కలెక్షన్ ల వర్షం కురిపిస్తున్నాయి.
అయితే ఈ రెండు సినిమాలు కూడా ఒకే నిర్మాణ సంస్థ నుండి విడుదలైన విషయం తెలిసిందే.రెండు సినిమాలు ఒకే నిర్మాణ సంస్థ నుండి విడుదల కావడం అందులోనూ ఇద్దరు టాప్ హీరోల సినిమాలే కావడం అన్నది మామూలు విషయం కాదు అని చెప్పవచ్చు.

తాజాగా మైత్రి మూవీ మేకర్స్ వారికి కూడా అదే జరిగింది.బాలయ్య బాబు మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కూడా అగ్ర హీరోలు, అందులోనూ ఈ ఇద్దరు హీరోలు ఇండస్ట్రీలో మొదటి నుంచి ఎక్కువ సందర్భాలలో పోటీపడి మరి సినిమాలు విడుదల చేశారు.అందులోనూ ఇద్దరు ఒకేసారి సంక్రాంతి బరిలోకి దిగడంతో మైత్రి మూవీ మేకర్స్ వారు ఎలా కాకుండా ఇరుక్కుపోయారు.విడుదల తేదీ నుంచి ప్రమోషన్స్ వరకు ఇద్దరు హీరోలు తగ్గకుండా అదే రేంజ్ లో సినిమాలకు ప్రమోషన్స్ ను చేశారు.
ఈ రెండు సినిమా ప్రమోషన్స్ లో ఏ ఒక్క ప్రమోషన్ లో అయినా చిన్న వెలితి కనిపించిన ఆ హీరో అభిమానులు అసలు ఊరుకోరు.

జనవరి 12 బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా విడుదల కాగా జనవరి 13న అనగా మరుసటి రోజు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదల అయింది.ఈ సినిమా ప్రమోషన్స్ కూడా సమానంగానే చేశారు.అయితే రిజల్ట్ విషయంలో బాలయ్య కాస్త డల్ అయినప్పటికీ వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ హిట్ కొట్టేశారు.
అక్కడ మైత్రి మూవీ మేకర్స్ వారు బ్యాలెన్స్ అయినప్పటికీ ఆ సినిమాల కలెక్షన్స్ బయటపడితే మాత్రం బాలయ్య బాబు ఊరుకోరు అని చెప్పవచ్చు.ఒకవైపు బాలయ్య మరొకవైపు చిరంజీవి ఎవరికి సర్ది చెప్పాలో తెలియక అంకెలు చూపించకుండా కలెక్షన్స్ పోస్టర్స్ వేసి సరిపెట్టేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్.
బాలయ్య బాబు చిరంజీవి దెబ్బకు మైత్రి మూవీ మేకర్స్ భయపడుతున్నారు అనడానికి కలెక్షన్ల విషయం బయటకు రాకుండా ఉండటమే ప్రధాన ఉదాహరణగా చెప్పవచ్చు.రెండు సినిమాల కలెక్షన్స్ బయటకు రాకుండా చూసుకుంటున్నారు మూవీ మేకర్స్.
కానీ సోషల్ మీడియాలో ఏవో అంచనాల ప్రకారం ఈ సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి.







