మ‌న దేశంలో మ‌నుషుల‌కు ప‌ట్టిన దెయ్యాల‌ను వ‌ద‌ల‌గొట్టే 7 ప్ర‌ముఖ ప్రాంతాలు ఇవే.!  

దెయ్యం ఉందా లేదా అన్న విష‌యాన్ని పక్క‌న పెడితే మ‌నం నిత్యం స‌మాజంలో దెయ్యం ప‌ట్టిన వారుగా చెప్ప‌బ‌డే కొందరిని చూస్తుంటాం. స‌రే… వారికి నిజంగా దెయ్యం ప‌ట్టిందా, లేదా అన్న‌ది ప‌క్క‌న పెడితే చాలా మంది మాత్రం ఈ విష‌యాన్ని న‌మ్ముతారు. ఈ క్ర‌మంలోనే దెయ్యం ప‌ట్టిన వారిని తీసుకెళ్లి దెయ్యం వ‌దిలిస్తుంటారు. ఈ దెయ్యం వ‌దిలించ‌డం అనే ప్ర‌క్రియ కేవ‌లం మ‌న ద‌గ్గ‌రే కాదు, విదేశాల్లోనూ ఉంది. దీన్ని ఇంగ్లిష్‌లో exorcism అని కూడా అంటారు. ఇదే కాన్సెప్ట్‌లో ప‌లు ఇంగ్లిష్ సినిమాలు కూడా వ‌చ్చాయ‌నుకోండి, అది వేరే విష‌యం. అయితే అనేక దేశాల్లో ఈ ప్ర‌క్రియ‌ను ర‌క ర‌కాలుగా చేప‌డుతారు. మ‌న దేశంలోనూ అనేక మ‌త‌స్తులు ఈ ప్ర‌క్రియ‌ను అవ‌లంబిస్తారు. ముస్లింలు దర్గాల్లో, హిందువులు ఆల‌యాల్లో, క్రిస్టియ‌న్లు చ‌ర్చిల‌లో దెయ్యాల‌ను వ‌దిలించే ప్రోగ్రామ్ పెడ‌తారు. ఈ క్రమంలోనే ఇలా దెయ్యాల్ని వ‌దిలించ‌డం కోసం మ‌న దేశంలో కొన్ని ప్ర‌దేశాలు బాగా పేరుగాంచాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Mysterious Temples Of India And Their Weird-Delhi Hanuman Temple Haridwar Nizamuddin Dargah Salangpur

Mysterious Temples Of India And Their Weird

Hazrat Syed Ali Mira Datar Dargah, Gujarat
ఈ ద‌ర్గాలో బాధితులు నెల రోజుల‌కు గ‌దులు బుక్ చేసుకోవ‌చ్చు. అద్దె నెల‌కు ఒక గ‌దికి రూ.800 ఉంటుంది. గ‌దిలో చేర‌గానే ఇక్క‌డి పెద్ద‌లు దెయ్యాల్ని వ‌దిలించే ప‌ని మొద‌లు పెడ‌తారు. అందులో భాగంగా దెయ్యం ప‌ట్టిన వారిని గొలుసుల‌తో క‌ట్టేస్తారు. ర‌క ర‌కాలుగా ప్ర‌య‌త్నించి దెయ్యం వ‌ద‌ల‌గొడ‌తారు. అయితే అందుకు రోజులు, నెల‌లు కూడా పట్ట‌వ‌చ్చు.

Mysterious Temples Of India And Their Weird-Delhi Hanuman Temple Haridwar Nizamuddin Dargah Salangpur

Dattatreya Mandir, Gangapur, Madhya Pradesh
ప్ర‌తి పౌర్ణ‌మి రోజున బాధితుల‌ను ఇక్క‌డికి తీసుకువ‌స్తారు. బాధితులు పెద్ద పెట్టున అరుస్తుంటారు. అక్క‌డి స్తంభాల‌పైకి విచిత్రంగా ఎక్కుతారు. ఆ ద‌శ‌లోనే దెయ్యాల‌ను వ‌ద‌ల‌గొట్టే ప‌నిలో ప‌డిపోతారు.

Mehandipur Balaji Temple, Rajasthan
రాజ‌స్థాన్ లోని దౌసా అనే జిల్లాలో ఈ టెంపుల్ ఉంది. ఇక్క‌డ దెయ్యం బాధితుల‌ను గొలుసులతో క‌ట్టేసి వారిపై వేడి నీళ్లు పోస్తారు. దీంతో దెయ్యం పోతుందని వారు భావిస్తారు. అయితే ఈ ప్ర‌దేశంలో చాలా ఆత్మ‌లు తిరుగుతుంటాయ‌ని న‌మ్ముతారు.

Nizamuddin Dargah, Delhi
దెయ్యాల‌నే వ‌ద‌ల‌గొట్టే ప్ర‌దేశంగానే కాదు, ఇది ప్ర‌స్తుతం ఓ టూరిస్ట్ ప్లేస్ అయింది. బాధితుల‌ను ఇక్క‌డ ఓ గ‌దిలో ఉంచి మంత్రాలు చ‌దువుతూ దెయ్యాల‌ను వ‌ద‌ల‌గొడ‌తారు.

Mysterious Temples Of India And Their Weird-Delhi Hanuman Temple Haridwar Nizamuddin Dargah Salangpur

Devji Maharaj Mandir, Malajpur, Madhya Pradesh
ఇక్క‌డ ప్ర‌తి ఏటా భూత్ మేళా అని ఓ ఉత్స‌వం జ‌రుగుతుంది. చాలా ప్రాంతాల నుంచి ఈ మేళాకు బాధితులు వ‌స్తారు. చీపురు క‌ట్ట‌లు, క‌ర్పూరం వంటి వస్తువుల‌ను ఉపయోగించి దెయ్యాల‌ను వ‌ద‌ల‌గొడ‌తారు.

Chandi Devi Temple, Haridwar, Uttar Pradesh దుర్గా దేవి క్షుద్ర రూపమే చండీ దేవి అని భ‌క్తులు నమ్ముతారు. న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ఇక్క‌డ ఘ‌నంగా జ‌రుగుతాయి. దెయ్యాలు ప‌ట్టిన వారిని ఇక్క‌డికి తీసుకువ‌స్తే అవి పారిపోతాయ‌ని భ‌క్తులు న‌మ్ముతారు.

Mysterious Temples Of India And Their Weird-Delhi Hanuman Temple Haridwar Nizamuddin Dargah Salangpur

Hanuman Temple, Salangpur, Gujarat
శ్రీ క‌ష్ట భంజ‌న్ దేవ్ అని ఇక్క‌డి హ‌నుమంతున్ని పిలుస్తారు. దెయ్యాలు ప‌ట్టిన వారిని ఈ ఆల‌యానికి తెస్తే వారిలో ఉన్న దెయ్యాలు పోతాయ‌ని భ‌క్తులు న‌మ్ముతారు.