నా హార్ట్ చాలా వీక్.. రోజుకు 24 గంటలు సరిపోలేదు: రష్మిక

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమా విడుదల అవుతుంది అంటేనే పెద్ద ఎత్తున ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లడానికి చిత్ర బృందం ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం మనం చూస్తున్నాము.

 My Heart Is Very Weak 24 Hours A Day Is Not Enough Rashmika , Rashmika , Directe-TeluguStop.com

అయితే ఒకప్పుడు ఇలాంటి సినిమా ప్రమోషన్లలో ఇంటర్వ్యూలు చేయడం కోసం సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించేవారు.అయితే ప్రస్తుత కాలంలో బిత్తిరి సత్తి చాలా ఫేమస్ అయ్యారు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల నుంచి మొదలుకొని సర్కారు వారి పాట, ఎఫ్ 3, మేజర్ చిత్ర బృందం బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలలో భాగంగా బిత్తిరి సత్తి తన యాసతో భాషతో పెద్ద ఎత్తున సెలబ్రిటీలను నవ్విస్తున్నారు.

తాజాగా సీతారామం ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రష్మిక బిత్తిరి సత్తితో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఇక ఈ ఇంటర్వ్యూలో బిత్తిరి సత్తి మాటలకు రష్మిక పడి పడి నవ్వారు.

ఇలా రష్మిక నవ్వడం ఎప్పుడూ చూడలేదని ఆమె అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.రష్మిక సైతం బిత్తిరి సత్తిలాగే మాట్లాడటానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది.

ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బిత్తిరి సత్తి ఆమెను ప్రశ్నిస్తూ మీరు వరుస సినిమాలలో నటిస్తున్నారు కదా 24 గంటలు సరిపోతున్నాయా అని ప్రశ్నించగా తనకు రోజుకి 24 గంటలు సరిపోలేదని 36 గంటలు కావాలి అంటూ సరదాగా సమాధానం చెప్పారు.

Telugu Ancor Suma, Bittiri Satti, Rajamouli, Rashmika, Sitaramam, Tollywood-Movi

మందన్న చాలా కష్టంగా ఉంది, నిన్ను యేమని పిలవాలి అంటే రష్, రోజ్, క్రష్ అని పిలువు అంది.ఇక సీతారామం సినిమా గురించి మాట్లాడుతూ డైరెక్టర్ హను రాఘవపూడి సెట్ లో చాలా గట్టిగా అరుస్తారని అలా ఆయన అలా అరిస్తే నేను దగ్గరకు వెళ్లి సర్ నా హార్ట్ కొంచెం వీక్ మెల్లిగా అరవండి సార్ అని చెబుతానంటూ ఈమె డైరెక్టర్ గురించి వెల్లడించారు.ఇక ఈ సినిమా గురించి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రష్మిక ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ముచ్చటించారు.

ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube