ముంబై నుంచి అయోధ్యకు కాలినడకన బయలుదేరిన ముస్లిం భక్తురాలు.. స్వచ్చమైన హృదయం ఉండాలంటూ?

2024 సంవత్సరం జనవరి నెల 22 వ తేదీన అయోధ్యలో రామ మందిరం( Ayodhya Ram Mandir ) ప్రారంభోత్సవం గ్రాండ్ గా జరగనున్న సంగతి తెలిసిందే.

దేశంలోని రాజకీయ, సినీ ప్రముఖులకు ఈ వేడుకకు ఆహ్వానాలు అందాయి.

లక్షల సంఖ్యలో రామ భక్తులు ఆరోజు అయోధ్యకు చేరుకోనున్నారు.ఎన్నో ప్రత్యేకతలతో ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది.

దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు.అయితే ముంబై నుంచి అయోధ్యకు కాలినడకన ఒక ముస్లిం భక్తురాలు బయలుదేరింది.

ఆ యువతి పేరు షబ్నమ్ షేక్( Shabnam Shaikh ) కాగా మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబైకు చెందిన ఈ యువతి వయస్సు కేవలం 19 సంవత్సరాలు కావడం గమనార్హం.ప్రస్తుతం బీఏ సెకండ్ ఇయర్ చదువుకున్న షబ్నమ్ షేక్ తన్ స్నేహితులతో కలిసి అయోధ్యకు కాలినడకన బయలుదేరడం గమనార్హం.

Advertisement

షబ్నమ్ షేక్( Shabnam Shaikh ) కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే షబ్నమ్ దాదాపుగా 450 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేయగా మరో 1150 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది.ఆ యువతి మీడియాతో మాట్లాడుతూ నేను ముస్లిం అయినందుకు గర్వపడుతున్నానని అదే సమయంలో రాముడిని కూడా నమ్ముతానని అన్నారు.

రాముడి( Lord rama )ని నమ్మాలంటే హిందువుగా ఉండాల్సిన అవసరం లేదని మంచి వ్యక్తిగా స్వచ్చమైన హృదయంతో ఉండాలని ఆమె పేర్కొన్నారు.షబ్నమ్ షేక్ పై కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తుండగా ఆమె ఆ కామెంట్లను పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు.అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ కు సోనియా గాంధీ హాజరు కానుండగా శరద్ పవార్ తనకు ఆహ్వానం అందలేదని చెప్పుకొచ్చారు.2050 నాటికి రామ మందిరం ఎలా ఉండబోతుందో చెబుతూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం.మొత్తం 6,000 మంది అతిథులు ఈ వేడుకలో పాల్గొననున్నారని జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు