ఇది విన్నారా? పుచ్చకాయ ముక్కలతో సంగీతం!

ఏంటి ? మాకు ఏమైనా పిచ్చి అనుకున్నారా? పుచ్చకాయతో సంగీతం ఏంటి అని ఆశ్చర్యం వేస్తుంది.ఎందుకంటే వేసవి కాలంలో పుచ్చకాయ తింటే మంచిది.

పుచ్చకాయలు తినడం వల్ల శరీరం కూల్ అయ్యి ఆరోగ్యంగా ఉంటాము.వేసవి కాలంలో పుచ్చకాయలకు భారీగా డిమాండ్ ఉంటుంది.

అలాంటి పుచ్చకాయతో ఆరోగ్యమే కాదు.మంచి సంగీతం కూడా పలికించవచ్చని నిరూపించాడు.

అమెరికాకు చెందిన మెర్కెజ్ అనే వ్యక్తి సరికొత్త పియానోని సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.అసలు ఏం చేశాడు అంటే? పుచ్చకాయను ముక్కలు ముక్కలుగా కోసి దానికి ఎలక్ట్రిక్ సర్క్యూట్ లను ఏర్పాటు చేశాడు.అనంతరం ఆ ఎలక్ట్రిక్ సర్క్యూట్ లను కంప్యూటర్ కు కనెక్ట్ చేశాడు.

Advertisement

పవర్ ఆన్ చేసి పుచ్చకాయలు లయబద్దంగా టచ్ చేస్తుంటే దానికి అనుగుణంగా మ్యూజిక్ ప్లే అవుతుంది.పుచ్చకాయ ముక్కలు, కివి ముక్కలతో చేసిన ఈ ప్రయోగం విజయవంతం అవ్వడంతో దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు