సౌత్ ఇండియా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్( Anirudh Ravichander ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సంగీతంతో ఆయన ఎంత మాయ చేస్తారో ఆయన ఇటీవల విడుదలైన సినిమాలు చూస్తే అర్థమవుతుంది.
సాధారణ మూవీలను ఎక్స్ట్రాడినరీ మూవీస్ గా తీర్చిదిద్దడంలో అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్( Anirudh Background Scroe ) మరో రేంజ్ లో ఉంటుంది అని ఒప్పుకోవాల్సిందే.అయితే సంగీతం పరంగా అతడు తోపు సంగీత దర్శకుడు అయితే కావచ్చు కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక వివాదాలు ఆయన చుట్టూ ఉంటూనే ఉంటాయి.
అనిరుద్ జీవితంలో ప్రేమలు, బ్రేకప్ లు చాలా సర్వసాధారణం అయిన విషయాలు.
స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబంలో పుట్టిన అనిరుద్ రవిచంద్రన్ కెరియర్ మొదలు పెట్టక ముందు నుంచి లవ్ లో మునిగి తేలుతూ ఉన్నాడు.కెరియర్ కాస్త కుదుట పడ్డాక మీడియా అటెన్షన్ అతనిపై పెరగడంతో ఒక ఇంటర్వ్యూ సందర్భంలో తన నిజ మైన ప్రేమ( True Love ) ఎవరిపై ఉంది అని యాంకర్ ప్రశ్నించగా సదరు ప్రశ్నకు జవాబు ఇచ్చిన అనిరుద్ తను 19 ఏళ్ళ వయసులోనే 25 ఏళ్ళ ఒక హీరోయిన్ తో ప్రేమలో పడ్డానని షాక్ ఇచ్చాడు.ఆ టైంలో ఆమె పెద్ద హీరోయిన్ గా ఉంది కానీ నేను అప్పటికి కేవలం సంగీతం అభ్యసిస్తున్నాను.
ఆ ఏజ్ లో ప్రేమ నిజమైనదని అనుకున్నాను.కానీ వయసు వ్యత్యాసం( Age Difference ) వల్ల మా ప్రేమకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు.
చాలా రోజులు పాటు బాగానే కలిసి ఉన్నాము.ఆ తర్వాత ఎందుకో సెట్ కాకపోవడంతో బ్రేకప్( Breakup ) జరిగిపోయింది.ఆ తర్వాత చాలా సార్లు చాలా మంది తో డేటింగ్స్, రిలేషన్స్ ఉన్నప్పటికి ఎక్కడ అవేమి వర్కౌట్ అవలేదు.ఇప్పటికి సింగిల్ గానే ఉన్నాను అంటూ అనిరుద్ చాలా మంది అమ్మాయిలకి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు.
ఇంతకి ఆ హీరోయిన్ ఎవరు అన్న ప్రశ్నకి కూడా అనిరుద్ ఈ ఇంటర్వ్యూలో సమాధానం కూడా చెప్పాడు.ఆమె ఎవరో కాదు నటి ఆండ్రియా( Actress Andrea Jeremiah ). తెలుగు, తమిళ్ లో ఆండ్రియా కొన్ని సినిమాల్లో నటించింది.అలాగే సింగర్ గా కూడా మంచి పేరును సంపాదించుకుంది.