విజయనగరం జిల్లాలో డిగ్రీ విద్యార్థి హత్య కేసు చేధన

విజయనగరం జిల్లా కెఎల్ పురంలో డిగ్రీ విద్యార్థి హత్య కేసులో పురోగతి లభించింది.హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

దీనిలో భాగంగా డిగ్రీ విద్యార్థి నవీన్ ను వాలంటర్ బ్రహ్మాజీ సినీ ఫక్కీ తరహాలో హత్య చేసినట్లు గుర్తించారు.తన ప్రియురాలిని నవీన్ వేధిస్తుండటంతో హత్యకు పాల్పడ్డాడని తెలిపారు.

హత్య పథకం ప్రకారం జరిగిందని, ముందుగా నవీన్ ను ఇంటికి పిలిచిన బ్రహ్మాజీ మద్యం తాగించాడని పోలీసులు పేర్కొన్నారు.ఈ క్రమంలోనే నవీన్ తో గొడవ పడి కర్రతో దాడి చేసి హతమార్చాడు.

అనంతరం ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడని బ్రహ్మాజీ ఫిర్యాదు చేశాడని పోలీసులు వెల్లడించారు.

Advertisement
ఆపరేషన్ బ్లూ స్టార్‌ ... నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి

తాజా వార్తలు