Murali Mohan : ఆ ఒక్క సినిమాతో సంపాదించింది మొత్తం పోగొట్టుకున్నాను : మురళి మోహన్

మురళి మోహన్( Murali Mohan )… నటుడిగా, నిర్మాత గా, రాజకీయ నాయకుడిగా మరియు వ్యాపారవేత్తగా అన్ని రంగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించి దిగ్గజ నటుడిగా, అగ్ర నిర్మాతగా, వ్యాపార దిగ్గజంగా కొనసాగారు.అయన పట్టిందల్లా బంగారం లాగ పరిస్థితి ఉండేది.

 Murali Mohan Lost His All Properties Due To Iddaru Movie-TeluguStop.com

అయితే మురళి మోహన్ ఏ రంగంలో అడుగుపెట్టిన సక్సెస్ అవ్వడం వెనక నిజాయితీ తో కూడా కష్టం మరియు క్రమశిక్షణ ఉండేది.అందుకే అయన ఈ వయసు లో కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చాల హుందాగా వ్యవహరిస్తూ ఉంటారు.

సినిమాల్లో హీరో గా పలు చిత్రాల్లో ఎంతో బిజీ గా ఉన్న టైం లో అయన నిర్మాతగా మారాలి అనుకున్నారు.

Telugu Iddaru, Kollywood, Mani Ratnam, Murali Mohan, Estate, Tollywood-Movie

ఈ సంచలన నిర్ణయం తీసుకుంది మొదలు కొందరు భాగస్వాములతో కలిసి అలాగే తన సోదరుడిని కలుపుకొని ఒక బ్యానర్ స్థాప్తించి సినిమాలు తీయడం మొదలు పెట్టారు.దాదాపు పాతిక సినిమాలు నిర్మించారు.అయితే మురళి మోహన్ ఏ విషయాన్నీ అయినా అంచనా వేయడం నిక్కచ్చిగా ఉంటారు.

సినిమా అయినా వ్యాపారం అయినా కూడా అయన ఒక నిర్ణయం తీసుకుంటే 90 శాతం విజయం దక్కినట్టే.కానీ అయన తీసుకున్న ఒక నిర్ణయం మాత్రం మురళి మోహన్ ని దాదాపు రోడ్డున పడేసింది.

అదే తమిళ్ లో మణిరత్నం( Mani Ratnam ) దర్శకత్వం లో వచ్చిన ఇరువర్ సినిమాను తెలుగు డబ్ చేసి విడుదల చేయాలి అనుకోవడం.ఈ నిర్ణయం తర్వాత అయన దాదాపు అప్పటి వరకు సంపాదించినా ఆస్తిని మొత్తం ఈ ఒక్క సినిమాతో పోగొట్టుకున్నారు.

Telugu Iddaru, Kollywood, Mani Ratnam, Murali Mohan, Estate, Tollywood-Movie

మణిరత్నం పై ఉన్న నమ్మకం తో ఆ సినిమాను విడుదల చేస్తే ఎవరు చూడలేదు .బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరపరాజయం పాలయ్యింది.అయినా కూడా జీవితంలో ఒక్క అడుగు వెనక్కి వేయకుండా పట్టుదలతో ఒక వైపు సినిమాలు మరో వైపు రియల్ ఎస్టేట్ రంగంలో ( Real Estate )బాగానే సంపాదించి పునరుత్సాహం తో సినిమాలు తీసి మళ్లి విజయాలను సొంతం చేసుకున్నారు.ఆలా చాల మంది నిర్మాతలు సినిమాలు తీసి రోడ్డున పడి దిక్కు లేకుండా వెళ్ళిపోతారు కానీ మురళి మోహన్ తెలివిగా అడుగులు వేసి మళ్లి పట్టు సాధించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube