ఎన్టీఆర్ ( NTR )రాజకీయ పార్టీ పెట్టగానే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయన వెనకాలే నడుస్తుంది అని అంతా భావించారు.కానీ అది జరగలేదు టిడిపి పార్టీ పెట్టిన తర్వాత ఆయన వెనకాల నడిచింది కేవలం ఇద్దరు ముగ్గురు నటీనటులు మాత్రమే.
టిడిపి పార్టీకి( TDP party ) సినిమా ఇండస్ట్రీ పూర్తి స్థాయిలో మద్దతు పలికింది చంద్రబాబు హయాంలో.ఇది చాలా సార్లు మనం చెప్పుకున్నాం….
ఇదే నిజం కూడా.ఎందుకంటే ఎన్టీఆర్ వెంట నడిచింది అప్పట్లో రావు గోపాల్ రావు ఒక్కరే.
ఆ తర్వాత జయప్రద, మోహన్ బాబు( Jayaprada, Mohan Babu ) కూడా కొన్ని రోజులు ఎన్టీఆర్ తో ఉన్నారు .ప్రచారం కూడా చేశారు .

కానీ ఎప్పుడైతే మురళీ మోహన్( Murali Mohan ) టిడిపి పార్టీని సీరియస్ గా తీసుకొని అక్కడ ఎన్టీఆర్ భవన్ లో తీష్ట వేసి కూర్చున్నారో అప్పటి నుంచి నటీనటులంతా ఎన్టీఆర్ భవన్ లో కనిపించడం మొదలు పెట్టారు, అలనాటి అందాల వెండి తెర సీత అయినటు వంటి అంజలీ దేవి నుంచి అందరు ఎన్టీఆర్ భవన్ లో కనిపించినవారే.అంజలీ దేవి, గీతాంజలి( Anjali Devi, Geetanjali ) వంటి బ్లాక్ అండ్ వైట్ హీరోయిన్స్ కూడా బాబు టిడిపి పార్టీ పగ్గాలు తీసుకోగానే ఏదో ఒక నియోజకవర్గంలో సీటు కోసం కాళ్ళు అరిగేలా తిరిగారు.అప్పటి అంజలి దేవి నుంచి నిన్న మొన్నటి లయ వరకు ఎన్టీఆర్ భవన్ లో కనిపించిన వారే.

మా అధ్యక్షుడుగా ఉన్నటువంటి మురళీ మోహన్ ఎన్టీఆర్ భవన్ లో కూర్చుని హీరో హీరోయిన్స్ ని, దర్శకులను, నిర్మాతలను, క్యారెక్టర్ ఆర్టిస్టులను, ఫ్యామిలీ ఆర్టిస్టులను అందరిని కూడా షూటింగ్స్ లేని సమయాల్లో ఎన్టీఆర్ భవన్ ( NTR Bhavan )కి తీసుకెళ్లారు, అలా చాలా మంది ఆయన వల్ల రాజకీయాల్లో కొంత దూరం నడిచారు, అలాగే కొంత మంది ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా గెలిచారు, కానీ కాల క్రమేణా అందరూ మళ్లీ టీడీపీ పార్టీ నుంచి దూరమయ్యారు.మురళీ మోహన్ పుణ్యమా అని దాదాపు డజన్ కి పైగా సినిమా ఇండస్ట్రీ వారు రాజకీయాల్లోకి వచ్చారు.కైకాల సత్యనారాయణ, రామానాయుడు, శారద వంటి వారు ఎమ్మెల్యే ఎంపీలుగా పని చేసిన వారే.
మురళి మోహన్ కుటుంబం మొత్తం కూడా టీడీపీ పార్టీ ప్రాణంగా చాల ఏళ్ళు ఉన్నారు.మా అధ్యక్షుడుగా ఉన్నటువంటి మురళీ మోహన్ ఎన్టీఆర్ భవన్ లో కూర్చుని హీరో హీరోయిన్స్ ని, దర్శకులను, నిర్మాతలను, క్యారెక్టర్ ఆర్టిస్టులను, ఫ్యామిలీ ఆర్టిస్టులను అందరిని కూడా షూటింగ్స్ లేని సమయాల్లో ఎన్టీఆర్ భవన్ కి తీసుకెళ్లారు, అలా చాలా మంది ఆయన వల్ల రాజకీయాల్లో కొంత దూరం నడిచారు, అలాగే కొంత మంది ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా గెలిచారు, కానీ కాల క్రమేణా అందరూ మళ్లీ టీడీపీ పార్టీ నుంచి దూరమయ్యారు.
మురళీ మోహన్ పుణ్యమా అని దాదాపు డజన్ కి పైగా సినిమా ఇండస్ట్రీ వారు రాజకీయాల్లోకి వచ్చారు.కైకాల సత్యనారాయణ, రామానాయుడు, శారద వంటి వారు ఎమ్మెల్యే ఎంపీలుగా పని చేసిన వారే.
మురళి మోహన్ కుటుంబం మొత్తం కూడా టీడీపీ పార్టీ ప్రాణంగా చాల ఏళ్ళు ఉన్నారు.