మెగా మేనల్లుడు సాయి తేజ్ రీసెంట్ గా విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.రిపబ్లిక్ సినిమా వర్క్ అవుట్ కాకపోవడం.
ఆ తర్వాత యాక్సిడెంట్ సాయి తేజ్ ( Sai Tej )కెరీర్ గ్రాఫ్ పడిపోయేలా చేయగా విరూపాక్ష( Virupaksha ) అతని కెరీర్ మీద మళ్లీ ఆశలు చిగురించేలా చేసింది.అయితే కేవలం తన సినిమానే కాదు అన్ని సినిమాలు బాగుండాలి.
బాగా ఆడాలని కోరుకునే హీరో సాయి తేజ్.అందుకే శుక్రవారం రిలీజ్ అయ్యే ప్రతి సినిమా గురించి అతని ట్వీట్ చేస్తూ వస్తున్నాడు.
కొన్నాళ్లుగా సాయి తేజ్ ట్విట్టర్ ని గమనిస్తే.గురు శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాల గురించి చిత్ర యూనిట్ అడిగినా అడకపోయినా సరే ఆ సినిమాలు మంచి విజయాలు అందించాలని కోరుతున్నాడు.
సాయి తేజ్ ట్వీట్ వల్ల కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న విషయం ప్రేక్షకులకు తెలుస్తుంది.నేడు రిలీజైన సినిమాలకు కూడా సాయి తేజ్ ట్వీట్ చేశాడు.ఏది ఏమైనా సాయి తేజ్ మంచి మనసుకి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.