తెలంగాణలో హీట్ పెంచుతున్నమునుగోడు రాజకీయాలు..

ఉద్యమాల పురిటిగడ్డ నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ వేడి రాసుకుంది.

భూమికోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం అని సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలోదిన నలగొండ జిల్లా కేంద్రంలో మరో ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో మునుగోడు రాజకీయాలు హీట్ ను పెంచాయి.

రాటు తేలిన రాజకీయ యోధుల ఖిల్లా నలగొండ జిల్లా క్షేత్రాన మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో అక్కడ ఎన్నికలు అనివార్యమైయ్యాయి.మొదటి నుండి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గానికి నిధులు కేటాయిస్తే ఎమ్మెల్యే పదవిని త్యాగం చేస్తానని గతంలోనే ప్రకటించారు.

అయితే తెలంగాణ రాష్ట్రం నిధులలేమితో దివాలా తీసిందని, కేవలం సీఎం కేసీఆర్ రాజకీయ స్వలాభపేక్ష కోసమే తన కుటుంబ పరిపాలన కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ రాజీనామా అస్త్రానికి తెర తీశారు.తెలంగాణ ఉద్యమ సమయంలో తరచూ ఉప ఎన్నికలకు వెళ్లిన కెసిఆర్ రాజకీయ వేడిని రాజేసిన విధంగా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వ్యవహార శైలి కొనసాగుతోంది.

దుబ్బాక, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలుపొందిన రామలింగారెడ్డి, నోముల నరసయ్య ల మృతితో ఎన్నికలు అనివార్యం అయ్యాయి.ఇక హుజురాబాద్ ఎన్నికల విషయానికొస్తే మంత్రివర్గం నుండి సీఎం కేసీఆర్ ఈటెల రాజేందర్ ను భర్త రఫ్ చేయడంతో పాటు ఆయనపై భూ అక్రమణ కేసు నమోదు చేయడంతో ఈటెల రాజేందర్ తన శాసనసభ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక ఏర్పడింది.

Advertisement

ఆ తదుపరి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరి ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి పై విజయం సాధించారు.ఈటెల రాజేందర్ బిజెపి అభ్యర్థిగా గెలుపొందడంతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మరింత ఊపునిచ్చింది.

అప్పటినుండి తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ బిజెపిల మధ్య రాజకీయ యుద్ద వాతావరణం ఏర్పడింది.

ఇలాంటి తరుణంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామహస్త్రం కాంగ్రెస్ పార్టీ ఉన్న సీటు పోవడమే కాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని విమర్శించిన తీరును బట్టి చూస్తే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా లేదా అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది.మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన మునుగోడు నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా టిఆర్ఎస్ గెల్పొందాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా సర్వేలు ప్రారంభింపజేశారు మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే బలమైన నేత తమ పార్టీలోకి రావడం భవిష్యత్తు రాజకీయాలకు ఉపయోగకరంగా ఉంటుందన్న ఉత్సాహంలో భారతీయ జనతా పార్టీ ఉంది.ఇలాంటి తరుణంలో మునుగోడు ఉప ఎన్నిక మూడుముక్కలాటగా కొనసాగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో భవిష్యత్తు రాజకీయాలు పూర్తిగా తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే!.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు