కోనసీమ జిల్లా, అమలాపురం: అమలాపురం ప్లీనరీలో ఉద్వేగంగా ప్రసంగించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్. మంత్రి విశ్వరూప్ తో పాటు నన్ను అంతమొందించేందుకు కొన్ని దుష్ట శక్తులు కొందరు వ్యక్తులు ప్రోత్సాహించి చేయించారు.
నన్ను, నా భార్యను ఇంట్లో పెట్టి తగలబెట్టాలని చూసిన తర్వాత రాజకీయాల్లో కొనసాగడం సరికాదని భావించాను. ప్రజా జీవితంలో ఉండేందుకు మా కుటుంబాలు ఒప్పుకునే పరిస్థితులు లేవు.
రాజకీయాల్లో చూడకూడని, వినకూడని సంఘటనలు కోనసీమలో నా విషయంలో, మంత్రి విశ్వరూప్ విషయంలో జరగడం బాధాకరం.
అమలాపురంలో జరిగిన హింసాత్మకత ఘటన అత్యంత బాధాకరం.
కోనసీమ చరిత్ర చెరిపేయాలని కాదని కోనసీమ పేరును కొనసాగిస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరాం.ప్రజలు, ప్రతిపక్షాలు అడుగుతున్నారు ఒకసారి ఆలోచన చేయండి అని అధినాయకుడిని అడిగాం.
ఒక మత్యకారుడిగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాను అంటే అంబేడ్కర్ రే కారణం.జరిగిన అల్లర్లతో కోనసీమ జిల్లా అభివృద్ధి పదేళ్లు వెనక్కు వెళ్లిపోయింది.
ఏం జరిగినా మమ్మల్ని నమ్ముకున్న ప్రజలు, కార్యకర్తల కోసం నిస్వార్థంతో రాజకీయాల్లో పనిచేస్తాం.







