డబ్ల్యూపీఎల్ లో ( WPL ) మొదటి నుంచే ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతోంది.హర్మన్ ప్రీత్ కౌర్( Harmanpreet Kaur ) సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు ప్రత్యర్థి జట్టులకు చెమటలు పట్టిస్తూనే ఉంది.
ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచ్లలో, ఐదు మ్యాచ్లు గెలిచి లీగ్ టేబుల్ లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఇంకా ఆడాల్సిన మ్యాచులు మిగిలి ఉన్న కూడా ప్లే – ఆఫ్ రౌండ్ కు చేరింది ముంబై ఇండియన్స్.
తాజాగా గుజరాత్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 55 పరుగుల తేడాతో గెలిచి.ప్రత్యర్థి టీం ను చిత్తుగా ఓడించింది.టాస్ ఓడి బ్యాటింగ్ బరిలో దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.30 బంతుల్లో 51 పరుగులు చేసి ఒక ఆఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకుంది కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.

ముంబై ఇండియన్స్( Mumbai Indians ) భారీ స్కోరు నమోదు చేయలేదు అనుకునే క్రమంలో హర్మన్ ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్ తో అందరినీ ఆకట్టుకుంది.బ్యాటింగ్ కు దిగినప్పటి నుండి చివరి వరకు దూకుడును ప్రదర్శించడం వల్లే ముంబై ఇండియన్స్ 162 పరుగులు చేయగలిగింది.

ఇక 163 పరుగుల లక్ష్య చేదనకు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసి ఓడింది.ముంబై బౌలర్లు అయినా బ్రంట్, మ్యాథూస్ కీలక సమయాలలో వరుసగా వికెట్లు తీస్తూ గుజరాత్ ను కట్టడి చేస్తూ చెరో మూడు వికెట్లు తీశారు.అర్థ సెంచరీ తో అదరగొట్టిన హర్మాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకుంది.డబ్ల్యూపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఐదు విజయాలతో అగ్రస్థానంలో ఉంటే.
బెంగళూరు జట్టు వరుస ఐదు ఓటమిలతో చివరి స్థానంలో కొట్టుమిట్టాడుతోంది.గుజరాత్ జెయింట్స్ ఆడిన ఐదు మ్యాచ్లలో.
నాలుగు మ్యాచ్లలో ఓడి, ఒక మ్యాచ్ గెలిచి లీగ్ టేబుల్ లో చివరి నుండి రెండో స్థానంలో నిలిచింది.







