యూపీ వారియర్స్ ను చిత్తుగా ఓడించి ఫైనల్ కు ముంబై ఇండియన్స్..!

Mumbai Indians Beat UP Warriors To The Final, UP Warriors , Mumbai Indians , Women Premier League, Delhi Capitals , Sports

డబ్ల్యూపీఎల్( WPL ) ముగియడానికి కేవలం ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది.ఐపీఎల్ తరహాలో డబ్ల్యూపీఎల్ కూడా దాదాపు 20 రోజులపాటు ప్రేక్షకులను అలరించింది.

 Mumbai Indians Beat Up Warriors To The Final, Up Warriors , Mumbai Indians , Wo-TeluguStop.com

తాజాగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో యూపీ వారియర్స్ ను చిత్తుగా ఓడించి ముంబై ఇండియన్స్( Mumbai Indians ) ఫైనల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో పోటీపడేందుకు సిద్ధమైంది.

డబ్ల్యూపీఎల్ టైటిల్ సొంతం చేసుకోవడానికి నేరుగా ఫైనల్ కి వెళ్ళిన ఢిల్లీ జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి ఫైనల్ కు అర్హత సాధించిన ముంబై జట్టు తమ సరికొత్త స్ట్రాటజీలతో రేపు బరిలోకి దిగనున్నాయి.

ఎలిమినేటర్ మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది యూపీ వారియర్స్.ఇక టాస్ ఓడిన ముంబై జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

మొదటి 10 ఓవర్ల వరకు చాలా నెమ్మదిగా స్కోర్ చేస్తున్న ముంబై జట్టు ఆ తర్వాత దూకుడును పెంచి యూపీ వారియర్స్ ముందు 182 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

182 పరుగుల లక్ష్య చేదనలో బరిలో దిగిన యుపి వారియర్స్ మొదటి నుంచి ఓటమి దిశగానే సాగింది.ఓపెనర్లు శ్వేత (1), హీలీ (11) లు అవుట్ కావడంతోనే యూపీ వారియర్స్ పని అయిపోయింది.ఒక్క కిరణ్ నవగిరే నాలుగు ఫోన్లు మూడు సిక్స్ లతో 43 పరుగులు చేసింది.

మిగతా బ్యాటర్లంతా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోవడమే యూపీ వారియర్స్ విఫలానికి కారణం.ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లు వామ్గ్ నాలుగు వికెట్లు, సైకా ఇషాక్ రెండు వికెట్లు తీసి యూపీ వారియర్స్ బ్యాటర్లను కట్టడి చేశారు.

ముంబై ఇండియన్స్ జట్టు ప్లేయర్లు అటు బ్యాటింగ్ లోను, ఇటు ఫీల్డింగ్ లోనూ సమర్థవంతంగా ఆడడంతో ముంబై ఇండియన్స్ గెలిచి ఫైనల్ కు చేరుకుంది.ఫైనల్లో తలపడే ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్( Delhi Capitals ) జట్లు ఇంతవరకు పాల్గొన్న మ్యాచ్లలో బ్యాటింగ్, ఫీల్డింగ్ లలో అద్భుతంగా రాణించాయి.

కావున ఫైనల్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగే అవకాశాలు ఉన్నాయి.

యూపీ వారియర్స్ ను చిత్తుగా ఓడించి ఫైనల్ కు ముంబై ఇండియన్స్! - Telugu Latest Telugu #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube