యూపీ వారియర్స్ ను చిత్తుగా ఓడించి ఫైనల్ కు ముంబై ఇండియన్స్..!

డబ్ల్యూపీఎల్( WPL ) ముగియడానికి కేవలం ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది.

ఐపీఎల్ తరహాలో డబ్ల్యూపీఎల్ కూడా దాదాపు 20 రోజులపాటు ప్రేక్షకులను అలరించింది.

తాజాగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో యూపీ వారియర్స్ ను చిత్తుగా ఓడించి ముంబై ఇండియన్స్( Mumbai Indians ) ఫైనల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో పోటీపడేందుకు సిద్ధమైంది.

డబ్ల్యూపీఎల్ టైటిల్ సొంతం చేసుకోవడానికి నేరుగా ఫైనల్ కి వెళ్ళిన ఢిల్లీ జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి ఫైనల్ కు అర్హత సాధించిన ముంబై జట్టు తమ సరికొత్త స్ట్రాటజీలతో రేపు బరిలోకి దిగనున్నాయి.

ఎలిమినేటర్ మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది యూపీ వారియర్స్.ఇక టాస్ ఓడిన ముంబై జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

మొదటి 10 ఓవర్ల వరకు చాలా నెమ్మదిగా స్కోర్ చేస్తున్న ముంబై జట్టు ఆ తర్వాత దూకుడును పెంచి యూపీ వారియర్స్ ముందు 182 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

"""/" / 182 పరుగుల లక్ష్య చేదనలో బరిలో దిగిన యుపి వారియర్స్ మొదటి నుంచి ఓటమి దిశగానే సాగింది.

ఓపెనర్లు శ్వేత (1), హీలీ (11) లు అవుట్ కావడంతోనే యూపీ వారియర్స్ పని అయిపోయింది.

ఒక్క కిరణ్ నవగిరే నాలుగు ఫోన్లు మూడు సిక్స్ లతో 43 పరుగులు చేసింది.

మిగతా బ్యాటర్లంతా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోవడమే యూపీ వారియర్స్ విఫలానికి కారణం.ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లు వామ్గ్ నాలుగు వికెట్లు, సైకా ఇషాక్ రెండు వికెట్లు తీసి యూపీ వారియర్స్ బ్యాటర్లను కట్టడి చేశారు.

ముంబై ఇండియన్స్ జట్టు ప్లేయర్లు అటు బ్యాటింగ్ లోను, ఇటు ఫీల్డింగ్ లోనూ సమర్థవంతంగా ఆడడంతో ముంబై ఇండియన్స్ గెలిచి ఫైనల్ కు చేరుకుంది.

ఫైనల్లో తలపడే ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్( Delhi Capitals ) జట్లు ఇంతవరకు పాల్గొన్న మ్యాచ్లలో బ్యాటింగ్, ఫీల్డింగ్ లలో అద్భుతంగా రాణించాయి.

కావున ఫైనల్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగే అవకాశాలు ఉన్నాయి.

వైరల్ వీడియో: కన్న కొడుకు ముందే ఆ తండ్రిని పోలీసులు ఏకంగా..?!