ప్రజెంట్ ఏ ఇండస్ట్రీలో అయినా మల్టీ స్టారర్ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే.మన టాలీవుడ్ లో రాజమౌళి ఆర్ఆర్ఆర్( RRR ) వంటి మల్టీ స్టారర్ తీసాక ఇది వరల్డ్ వైడ్ సూపర్ హిట్ అయ్యాక మరింత ట్రేండింగ్ లోకి వచ్చేసింది.
అప్పటి నుండి అవకాశం ఉంటే ఇద్దరు హీరోలతో మల్టీ స్టారర్ ప్రకటిస్తున్నారు.
ఒక వేళ అవకాశం లేకపోయినా క్యామియో రోల్స్ క్రియేట్ చేసి మరీ వేరే హీరోను సినిమాల్లో భాగం చేస్తున్నారు.
ఇక ఇప్పుడు తమిళ్ నుండి మరో భారీ మల్టీ స్టారర్ తెరకెక్కబోతుంది.నిన్ననే ఈ సినిమా అఫిషియల్ ప్రకటన రావడంతో తమిళ్ లో ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి.

మరి ఆ మల్టీ స్టారర్ ఏంటో తెలిసిందే.కోలీవుడ్ స్టార్ హీరో సూర్య( Surya ) 43వ సినిమా నిన్న ప్రకటన వచ్చింది.ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్( Dulquer Salman ) కీలక రోల్ చేస్తున్నట్టు ప్రకటన వచ్చింది.సెన్సేషనల్ దర్శకురాలు సుధా కొంగర( Sudha Kongara ) ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు.

ఈ కాంబో ఇప్పటికే ‘ఆకాశమే నీ హద్దురా’ అనే సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది.ఇక ఇప్పుడు ఈ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతుంది.ఈ సినిమా కూడా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుందని తెలుస్తుంది.గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు టాక్.
మరి ఈసారి కూడా ఈ కాంబో గ్రాండ్ సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది చూడాలి.ఇక నిన్న మోషన్ పోస్టర్ టీజర్ రిలీజ్ చేయగా పవర్ఫుల్ గా అదిరిపోయింది.
అలాగే ఇందులో నజ్రియా ఫహద్,( Nazriya Fahadh ) విజయ్ వర్మలు ( Vijay Varma ) నటిస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు.ఇంకా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో చూడాలి.







