టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.టీడీపీ హయాంలో రైతులు, మహిళలను మోసం చేశారని ఆరోపించారు.
బెల్టు షాపులను రద్దు చేస్తామని విచ్చలవిడిగా నడిపించారని మంత్రి బొత్స తెలిపారు.ఈ క్రమంలోనే మరోసారి దొంగల ముఠా ప్రజల ముందుకు వస్తుందని పేర్కొన్నారు.
అయితే వంచనదారుల మాటలను ప్రజలు నమ్మొద్దని సూచించారు.నారా భువనేశ్వరి స్వేచ్ఛగా యాత్ర చేస్తున్నారన్న మంత్రి బొత్స అంతకన్నా ఇంకా ఏం స్వేచ్ఛ కావాలని ప్రశ్నించారు.
ఎవరిని మోసం చేయడానికి భువనేశ్వరి ప్రయత్నిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.







