కేంద్ర కేబినెట్ పదవికి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ రాజీనామా..

బీజేపీ నేత, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తన పదవికి రాజీనామా చేశారు.ఆయనతో పాటు మరో మంత్రి కూడా పదవి నుంచి రాజీనామా చేయనున్నారు.

 Mukhtar Abbas Naqvi Resigned From The Post Of Central Cabinet , Prime Minister Narendra Modi, Mukhtar Abbas Naqvi, The Bjp-TeluguStop.com

వీరిద్దరి రాజ్యసభ పదవీకాలం గురువారంతో ముగియనుంది.ఈ నేపథ్యంలోనే వారు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు… అయితే, బీజేపీకి సుదీర్ఘకాలంగా అధికారిక ప్రతినిధిగా వ్యవహరించిన నఖ్వీకి దేశ అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతిగా బరిలోకి దింపనున్నట్టు తెలుస్తోంది.

నఖ్వీ రాజీనామాపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఎన్డీయే అభ్యర్థిగా నఖ్వీని నిలబెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.ఈరోజు ఉదయం నఖ్వీతో ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యేక చర్చలు జరపడం ఊహాగానాలకు బలం చేకూర్చుతోంది.

 Mukhtar Abbas Naqvi Resigned From The Post Of Central Cabinet , Prime Minister Narendra Modi, Mukhtar Abbas Naqvi, The BJP-కేంద్ర కేబినెట్ పదవికి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ రాజీనామా..-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Mukhtarabbas, Primenarendra, Bjp-Latest News - Telugu

మైనార్టీ వర్గాల్ని ప్రభావితం చేసేదిశగా బీజేపీ అధిష్ఠానం యోచిస్తున్నట్టు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో నఖ్వీని ఉపరాష్ట్రపతి పదవికి బరిలో దించాలని ఎన్డీయే వర్గాలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం… మరోవైపు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థి రేసులో పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌, కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.తాజాగా నఖ్వీ పేరు తెరపైకి వచ్చింది.

దీంతో ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే ఎవరిని నిలబెడ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది.

ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.

ఇవాళ్టితో కేంద్రమంత్రులు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మరియు మరో మంత్రి రాజీనామా చేయడంపై జాతీయ రాజకీయ నేతల్లో చర్చనీశయంగా మారింది.

అయితే, బీజేపీకి సుదీర్ఘకాలంగా అధికారిక ప్రతినిధిగా వ్యవహరించిన నఖ్వీకి దేశ అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతిగా బరిలోకి దింపనున్నట్టు తెలుస్తోంది.వచ్చే నెల 6 వ తారీఖున ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి…

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube