షాకింగ్: దుబాయ్ శీనులో MS నారాయణ ఆ టాప్ హీరోని ఇమిటేట్ చేశారా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రత్యేక గుర్తింపును సాధించిన కమెడియన్ల జాబితాలో ఎం.ఎస్ నారాయణ ఒకరు.

తాగుబోతు క్యారెక్టర్లు ఎక్కువ పోషించిన ఈ కమెడియన్.తాగుబోతులా నటిస్తూ ప్రేక్షకులను నవ్వించాడు.

ఎం.ఎస్ నారాయణ ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించగా.

దుబాయ్ శీను సినిమాలో చేసిన కామెడీ క్యారెక్టర్ ఎంతోమందిని అలరించింది.దుబాయ్ శీను సినిమాలో ముసలి హీరోగా ఎం.ఎస్ నారాయణ ఓ కామెడీ క్యారెక్టర్ ని చేయగా.ఆ క్యారెక్టర్ బాగా ఫేమస్ అయింది.

Advertisement

అందులో హీరోయిన్లతో బాగా రొమాన్స్ చేయాలని కోరుకునే ముసలి హీరోగా, కెమెరా ముందు పోజులివ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపించే హీరోగా ఎం.ఎస్ నారాయణ నటించారు.అయితే ఈ క్యారెక్టర్ ఓ టాప్ హీరో ఇమిటేషన్ అని చాలామందికి తెలియకపోవచ్చు.

తెలుగులో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ వాయిస్ ని ఎం.ఎస్ నారాయణ దుబాయ్ శీను సినిమాలో ఇమిటేట్ చేశాడు.ఈ సినిమా తనకు ఎంతో గుర్తింపు తెచ్చిందని ఆయన తెలిపారు.

పేరడీలు చేసినా ఎవరూ నెగిటివ్ గా స్పందించలేదని, అది తన అదృష్టం అని అన్నారు.

ఓసారి సూపర్ స్టార్ కృష్ణ తనను పిలిపించాడని, తన భార్య విజయ నిర్మలతో.‘వీడు మరో అల్లు రామలింగయ్య అవుతాడు’ అంటూ ప్రశంసించారని ఎం.ఎస్ నారాయణ వెల్లడించారు.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

తెలుగులో చాలాసార్లు టాప్ హీరోలను ఇమిటేట్ చేస్తామని, డైరెక్టర్లు చెప్పిన విధంగా నటులుగా తాము ఆ క్యారెక్టర్లు చేస్తామని ఎం.ఎస్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు